నువ్వు మగాడివిరా బుజ్జి.. శివాజీ వాఖ్యలపై మనోజ్ ఘాటైన లేఖ.. మంచు లక్ష్మీ రియాక్షన్

హీరోయిన్లు, మహిళా నటుల వస్త్రధారణపై హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు సినీ రంగంలో సంచలనం రేపింది. హీరోయిన్లు మోడ్రన్ డ్రెస్‌లతో అందాల ప్రదర్శన చేయకుండా పద్ధతిగా చీర కట్టుకోవాలంటూ ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. శివాజీ చేసిన వ్యాఖ్యలు తాలుకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పై సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్ ఈ వివాదంపై స్పందించారు.

డిసెంబర్ 25న దండోరా
లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని దండోరా చిత్రాన్ని నిర్మించారు. శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫిని, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా, మార్క్ కే రాబిన్ మ్యూజిక్, క్రంతి ప్రియం ఆర్ట్ డైరెక్టర్‌గా, రేఖా బొగ్గార‌పు కాస్టూమ్ డిజైనర్‌గా పనిచేశారు. డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 22న హైదరాబాద్‌లో దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో శివాజీ మాట్లాడుతూ.. గ్లామర్ పేరుతో హీరోయిన్లు సామాన్లు ప్రదర్శించొద్దని వ్యాఖ్యానించారు.

Manchu Manoj Slams Sivaji s Remarks on Heroines Dressing Lakshmi Manchu thanks to her brother

శివాజీపై అనసూయ, చిన్మయి ఫైర్
ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన అనంతరం నెటిజన్ల ట్రోలింగ్ మొదలైంది. ఆ వెంటనే నటి అనసూయ భరద్వాజ్ అయితే నా బాడీ నా ఇష్టం, నాకిష్టం వచ్చినట్లుగా ఉంటానని కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత సింగర్ చిన్మయి శ్రీపాద కాస్త ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. శివాజీ వాడిన పదాలను ఎక్కువగా పోకిరీలే మాట్లాడతారు. బహిరంగ ప్రదేశాల్లో దరిద్రపు ముండ అనే పదాలు వాడుతున్నాడు. ఆయన జీన్స్, హూడీ ధరించి వచ్చాడు. మరి భారతీయ సాంప్రదాయాలను పాటించే వాడైతే ధోతీ కట్టుకుని రావాలి కదా? ఆయనకు పెళ్లయి ఉంటే కంకణం ధరించి బొట్టు, మెట్టెలు కూడా పెట్టుకోవాలి కదా అని చిన్మయి వ్యాఖ్యానించారు.

మంచు మనోజ్ ఫైర్
ఈ వివాదం అంతకంతకూ ముదురుతున్న నేపథ్యంలో హీరో మంచు మనోజ్ సంచలన పోస్ట్ పెట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు నిరాశ కలిగించాయి. మహిళలు ఇటువంటి బట్టలే ధరించాలని, వారిని ఒక ఛట్రానికే పరిమితం చేయడం కరెక్ట్ కాదు. ధరించే బట్టలను బట్టి తోటివారిని హేళన చేయడం సరికాదు. మహిళల గౌరవం, సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగ హక్కులు. భారత రాజ్యాంగంలోని 14, 15, 21 అధికరణాలకు విరుద్ధంగా ఇలాంటి వ్యాఖ్యలు ఉన్నాయి అని మంచు మనోజ్ పేర్కొన్నారు.

మహిళా లోకానికి మనోజ్ క్షమాపణలు
మహిళల బట్టలపై తీర్పు చెప్పే అధికారం ఎవ్వరికీ లేదని.. వాటిపై నీతులు చెప్పడం అనేది పాత రోజుల్లో ఆలోచన. మహిళలను కించపరిచేలా మాట్లాడిన సదరు నటుడి తరపున నేను క్షమాపణలు చెబుతున్నా. పురుషులంతా అలాంటి అభిప్రాయంతో ఉండరు. సెలబ్రిటీలుగా ఉన్న వారి మాటలు సమాజంపై ప్రభావం చూపుతాయి. ఈ తరహా ప్రవర్తనను మౌనంగా భరించడం కుదరు. మహిళకు ఎల్లప్పుడూ గౌరవం, సమానత్వం దక్కాలి. ఈ విషయాల్లో మౌనం వహించడం సరైన విధానం కాదు. ఈ తరహా అంశాల్లో జవాబుదారీతనం ముఖ్యమని మంచు మనోజ్ పేర్కొన్నారు.

మనోజ్‌కు థ్యాంక్స్ చెప్పిన లక్ష్మీప్రసన్న
ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మంచు మనోజ్‌పై ప్రముఖులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మనోజ్ సోదరి, నటి మంచు లక్ష్మీప్రసన్న స్పందించారు. నువ్వు నిజమైన మగాడివి, థ్యాంక్స్ అని పోస్ట్ పెట్టారు. ఈ వివాదం నానాటికీ ముదురుతున్న నేపథ్యంలో శివాజీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X