ముఖ్యమంత్రిని బావా అనేసిన మంచు మనోజ్.. చిన్ననాటి ఆసక్తికర ఫొటో షేర్ చేస్తూ!
ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (డిసెంబర్ 21) నిన్న పుట్టిన రోజు జరుపుకున్నారు. నిన్నటితో 46 వసంతాలు పూర్తిచేసుకున్న ఆయన 47వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్బంగా ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంచు మనోజ్ స్పెషల్ విషెస్
ఈ మేరకు టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ కూడా సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్పెషల్ విషెస్ అందించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తల్లిదండ్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, విజయమ్మలతో కలిసి దిగిన ఆ నాటి ఫొటోను షేర్ చేస్తూ తన శుభాకాంక్షలు తెలిపాడు ఈ మంచువారబ్బాయి.

బావ అంటూ సందేశం
''దేశంలోనే యంగెస్ట్ సీఎం.. నేను ఎంతగానో ప్రేమించే మా బావ వైఎస్ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ జీవితం సంతోషకరంగా ముందుకు సాగాలి సీఎం గారూ'' అంటూ తన ట్విట్టర్‌లో సందేశం పోస్ట్ చేశాడు మంచు మనోజ్. ఈ పోస్ట్ చూసి జగన్‌కి నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.

జగన్- మంచు మనోజ్ రిలేషన్ ఇదే..
మంచు మనోజ్ వదిన విష్ణు భార్య విరోనిక వైఎస్ కుటుంబానికి చెందని ఆడబిడ్డ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండో తమ్ముడు సుధీర్ రెడ్డి కూతురే ఈ విరోనిక. జగన్, విరోనికలు అన్నదమ్ముల బిడ్డలు కాబట్టి జగన్‌కి విరోనిక చెల్లెలు. ఈ వరస ప్రకారమే వైఎస్ జగన్‌ను బావా అంటూ సంభోదించారు కాబోలు మంచు మనోజ్.
విడాకులతో వివాహ బందానికి ఫుల్‌స్టాప్
ఇటీవలే తన రెండేళ్ల వివాహబంధానికి స్వస్తి చెప్పాడు మంచు మనోజ్. విడాకులతో తన వివాహ బందానికి ముగింపు పలుకుతున్నానని చెప్పి సంచలనం సృష్టించిన ఆయన.. ఇటీవలే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాడు. ఈ మేరకు ఇకపై తన ద్యాస అంతా సినిమాల పైనే ఉంటుందని ప్రకటించాడు మంచు మనోజ్.


Click it and Unblock the Notifications











