HBD Manchu Manoj: మిరాయ్ నుంచి మనోజ్ సర్‌ప్రైజ్.. ఇది హాలీవుడ్ మూవీనా ఏంటి!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడిగా సినిమాల్లోకి వచ్చి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు టాలెంటెడ్ హీరో మంచు మనోజ్. హీరోగా ఎన్నో ప్రయోగాలు చేసిన అతడు.. పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. పర్సనల్ లైఫ్‌లోనూ ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. దీంతో చాలా కాలం పాటు కెరీర్‌కు గ్యాప్ ఇచ్చి.. ఇటీవలే రెండు సినిమాలను ప్రకటించాడు.
మంచు మనోజ్ ఇప్పటికే హీరోగా పలు చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు విలన్‌గానూ ఓ సినిమాలో నటిస్తున్నాడు. అదే 'మిరాయ్' (Mirai). కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో హనుమాన్ ఫేం తేజ సజ్జా హీరోగా నటిస్తోన్నాడు. ఇప్పటికే అతడికి సంబంధించిన గ్లింప్స్ వీడియోను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'మిరాయ్' సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. అంతేకాదు, కొద్ది రోజుల్లోనే చాలా వరకూ టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు. ఇక, ఇందులో మంచు మనోజ్ కూడా నటిస్తుండడంతో దీనిపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
హై రేంజ్ కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న 'మిరాయ్' మూవీ నుంచి మంచు మనోజ్ పుట్టినరోజు కానుకగా The Black Sword పేరిట అతడి క్యారెక్టర్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో ఈ టాలెంటెడ్ హీరో ఎంతో స్టైలిష్ విలన్‌గా కనిపించాడు. శత్రువులను తన ఖడ్గంతో ఊచకోత కోస్తూ రెచ్చిపోయాడు. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ రేంజ్‌లో డిజైన్ చేశారని చెప్పొచ్చు.
తాజాగా వచ్చిన గ్లింప్స్‌లో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ముఖ్యంగా ఇందులో మంచు మనోజ్ కిల్లింగ్ లుక్స్ సర్‌ప్రైజింగ్‌గా ఉన్నాయి. మొత్తానికి 'మిరాయ్' నుంచి వచ్చిన మంచు మనోజ్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసిందని చెప్పాలి. అదే సమయంలో అతడి రోల్‌పై అందరిలోనూ హైప్ బీభత్సంగా పెరిగిపోతుందని అనొచ్చు.
ఇదిలా ఉండగా.. తేజ సజ్జా - కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'మిరాయ్' మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీని 2025 ఏప్రిల్ 18వ తేదీన విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, చైనీస్ భాషల్లో ఇది రిలీజ్ కాబోతుంది.


Click it and Unblock the Notifications











