twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు నేను ఎప్పుడూ ప్రశ్నించుకుంటూనే ఉంటా.. అది ఆ దేవుడుకే తెలుసు: మంచు మనోజ్ భావోద్వేగం

    |

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా ఘటనపై యావత్ ప్రపంచం చలించి పోతోంది. అత్యంత క్రూరంగా నిందితులు చేసిన ఈ పని పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతూ ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిశా ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులను పరామర్శించారు మంచు మనోజ్. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ దుర్ఘటనను తీవ్రంగా ఖండించారు. వివరాల్లోకి పోతే..

    శిక్ష పడేవరకు పోరాటం.. మనోజ్ హామీ

    శిక్ష పడేవరకు పోరాటం.. మనోజ్ హామీ

    మంగళవారం హీరో మంచు మనోజ్ వెటర్నరీ డాక్టర్ తల్లిదండ్రులను ఓదార్చి.. దిశ చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. దోషులకు శిక్ష పడేవరకు పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు దిశ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆ ఘటన తలచుకొని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు మనోజ్.

    ఇలాంటి సమాజంలోనా మనం జీవించేది? పోలీసుల రక్షణ!

    ఇలాంటి సమాజంలోనా మనం జీవించేది? పోలీసుల రక్షణ!

    ఈ సందర్బంగా మీడియా ముందుకొచ్చిన మంచు మనోజ్.. ''ఆ నాడు నిర్భయ, ఇప్పుడు దిశ.. ఈ మధ్యలో ఎన్నో చెప్పారని ఉదంతాలు.. ఈ సమాజం ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం కావడం లేదు. ఇలాంటి సమాజంలోనా మనం ఉండేదని నాకు నేను ఎప్పుడూ ప్రశ్నించుకుంటూనే ఉంటా'' అని అన్నారు. నేటి సమాజంలో పోలీసుల రక్షణ ఉంటుందనే ఆడపిల్లలు బయటకొస్తున్నారని, కానీ ఆ రోజు ఎందుకు ఇలా నిర్లక్ష్యం జరిగిందో ఆ దేవుడికే తేలియాలంటూ ఆవేశంగా మాట్లాడారు మనోజ్.

     ఆడపిల్లలు రాత్రిళ్లు తిరగకూడదా? ఆ సెక్యూరిటీ ఇవ్వలేమా?

    ఆడపిల్లలు రాత్రిళ్లు తిరగకూడదా? ఆ సెక్యూరిటీ ఇవ్వలేమా?

    ఆ సమయంలో పోలీసులు ఫోన్ చేయొచ్చుగా వాళ్లింట్లో వాళ్లకు ఎందుకు ఫోన్ చేసినట్టు? అని, ఆ టైంలో బయట ఎందుకు తిరగాల్సి వచ్చిందని మరొకరు అంటుండటం చూస్తున్నాం. మన ఆడపిల్లలు రాత్రిళ్లు తిరగకూడదా? బయటకు రావొద్దా? కనీసం మనం, మన సమాజం ఆడపిల్లకు ఆ సెక్యూరిటీ ఇవ్వలేమా?
    అని ప్రశ్నించారు మనోజ్.

    చట్టాల్లో మార్పులు తీసుకురావాలి

    చట్టాల్లో మార్పులు తీసుకురావాలి

    ఇలాంటి ఘటనలను అందరూ తీవ్రంగా ఖండించాలని అన్నారు మనోజ్. ఇలాంటి ఘటనలకు కారణమైన వారి పట్ల కఠినంగా ఉండాలని, తక్షణమే శిక్షలు అమలయ్యేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని మనోజ్ అన్నారు. గీత దాటితే 1000 చలాన్ విధించే ట్రాఫిక్ పోలీసులు.. ఓ ఆడపిల్ల జోలికి వస్తే ఎంత రిస్క్ ఉంటుందో తెలిసేలా అవేర్‌నెస్ తీసుకురావాలని మనోజ్ అన్నారు.

    Recommended Video

    #CineBox : Nani's New Film Titled Tuck Jagadish
    ప్రతీ కుటుంబంలో మార్పు రావాలి

    ప్రతీ కుటుంబంలో మార్పు రావాలి

    ముందు ప్రతీ కుటుంబంలో మార్పు రావాలని, భర్త తాగి వచ్చి భార్యను కొట్టడం లాంటి ఘటనలు ఇంట్లో ఉన్న పిల్లలపై ప్రభావితం చూపిస్తాయని మనోజ్ పేర్కొన్నాడు. ఈ ఇంపాక్ట్ పెద్దయ్యాక వారిని కూడా అలాంటి పనులే చేసేలా చేస్తుందని, అందుకే ముందు ప్రతీ ఇంట్లో కూడా మార్పు రావాలని ఆయన తెలిపారు.

    English summary
    Tollywood actor Manchu Manoj comented on Disha Murder Case. He visits Disha House and gets emotional.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X