‘చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.. ఆ తర్వాత జరిగిందిదే’
టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ మళ్లీ సినిమాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. 8 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ తిరిగి వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. కాగా రీసెంట్ ఇంటర్వ్యూలో మంచు మనోజ్ తన మానసిక ఒత్తిడి గురించి మాట్లాడుతూ వచ్చారు. ఆ సమయంలో తన అక్కడ మంచు లక్ష్మి ఎంతగానో సహకరించిందని, ఎన్నో సలహాలు చేసిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడాయన మాటలు ఆసక్తికరంగా మారాయి...
మంచు మనోజ్ సినిమాలు..
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొడుకుగా మంచు మనోజ్ తెలుగు ఆడియెన్స్ ఇప్పుడు సుపరిచితుడే. అయితే మనోజ్ తన 10వ ఏట నుంచే సినిమాల్లో నటించడం ప్రారంభించారు. తొలుత బాల నటుడిగా దివంగత, సీనియర్ ఎన్టీఆర్ నటించిన 'మేజర్ చంద్రకాంత్' చిత్రంలో నటించి మెప్పించారు. ఆ తర్వాత మరో మడూ చిత్రాలు 'పుణ్య భూమి నా దేశం', 'అడవిలో అన్న', 'ఖైదీ గారు' వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆకట్టుకున్నారు. ఇక 2004లో దొంగ దొంగది అనే చిత్రంతో హీరోగా లాంచ్ అయ్యారు. అలాగే శ్రీ, రాజు బాయ్, నేను మీకు తెలుసా, బిందాస్, వేదం, ఝుమ్మంది నాదం, మిస్టర్ నూకయ్య, పోటుగాడు, కరెంట్ తీగ, శౌర్య, గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక రీసెంట్ గా మే30న విడుదలైన 'భైరవం' చిత్రంతో మళ్లీ తెరపైకి వచ్చారు.

డిప్రెషన్ లోకి మంచు మనోజ్..
మంచు మనోజ్ తన రీసెంట్ ఫిల్మ్ భైరవం విడుదల తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. కొంతకాలంగా సినిమాలకు, మీడియాకు, తన అభిమానులకు దూరంగా ఉన్న ఆయన ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నాడు. అయితే మనోజ్ ఇటీవల తన జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా కాస్తా డిప్రెషన్ లోకి వెళ్లాడని చెప్పారు. దాంతో చాలా గందరగోళంగా జరిగిందన్నారు. అలాంటి సమయంలో అక్క మంచు లక్ష్మి తనకు సపోర్ట్ గా నిలిచిందన్నారు. థెరపీకి కూడా సూచించిందని చెప్పారు. డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఫ్యామిలీ, ఫ్రెండ్ అవసరమని చెప్పుకొచ్చారు. అలాగే నార్మల్ గా కూడా థెరపీ అనేది అవసరమేనని, దాన్ని పెద్దగా చూడాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు.
మంచు మనోజ్ కోసం మంచు లక్ష్మి సాహసం..
తమ్ముడు మంచు మనోజ్ కోసం అక్క మంచు లక్ష్మి సాహసమే చేసింది. మనోజ్ భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సమయంలో అంతా ఆమె పెద్ద దిక్కుగా వ్యవహరించింది. ఎలాంటి గొడవలు రాకుండా దగ్గరుండి తమ్ముడి పెళ్లిని జరిపించింది. అలాగే రీసెంట్ గా ఓ ఈవెంట్ లో మనోజ్ ను సడెన్ గా చూసి కన్నీళ్లు పెట్టుకుంది. తమ్ముడిపై తనకున్న ప్రేమను చూపించింది.
మనోజ్ రాబోయే చిత్రాలు..
మనోజ్ ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ కెరీయర్ పై ఫోకస్ పెట్టారు. ఇకపై వరుసగా సినిమాలు చేస్తానని తన అభిమానులకు హామీనిచ్చారు. ఇప్పటికే 'భైరవం'తో అలరించగా.. నెక్ట్స్ మిరాయ్, రక్షక్, వాట్ ది ఫిష్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. త్వరలోనే ఆ సినిమాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా అందనున్నాయి.


Click it and Unblock the Notifications











