twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాజీ మంత్రిని సినిమా చేయమన్న మంచు మనోజ్.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తానంటూ ట్వీట్

    |

    మంచు మనోజ్.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాల్లో ప్రయోగాలు చేశాడు. యాక్టర్‌గానే కాకుండా యాక్షన్ డైరెక్టర్‌గానూ సత్తా చాటాడు. ఒకానొక సందర్భంలో వరుస పెట్టి సినిమాలు చేసిన మంచు వారి అబ్బాయి.. తాజాగా స్పీడును తగ్గించాడు. ప్రస్తుతం అతడు ఒక్క సినిమాను కూడా చేయడం లేదు. దీంతో మనోజ్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

    సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉంటాడు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలను పంచుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ప్రస్తుతం ఎన్నో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటాడు. వీటితో పాటు సామాజిక, రాజకీయ అంశాలపై తరచూ స్పందిస్తూ ఉంటాడు. అందుకే మంచు మనోజ్ నిరంతరం వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా మనోజ్ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అవుతోంది.

    Manchu Manoj Tweet On KTR Photo

    ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన ట్విట్టర్‌లో ఆయన ఫొటోను షేర్ చేశారు. దీనిపై మంచు మనోజ్ స్పందించాడు. కేటీఆర్ ట్వీట్‌కు 'అన్నా.. సినిమాను స్టార్ట్ చేయండి. ఫస్ట్ డే ఫస్ట్ షో పక్కా. సూపర్ పిక్' అని రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    కొద్దిరోజుల కిందట 'సైరా: నరసింహారెడ్డి' సినిమాపై మంచు మనోజ్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'మిత్రమా రాంచరణ్.. నీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ అదుర్స్. వాట్ ఎ పవర్ ప్యాక్డ్ టీజర్. గూస్‌బమ్స్ వచ్చాయి. మెగాస్టార్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఎదురుచూడలేకున్నా. చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు' అని పేర్కొన్నాడు.

    English summary
    Manchu Manoj Kumar is an Indian film actor known for his works exclusively in Telugu cinema. Kumar first appeared at the age of ten as a child artist in Major Chandrakanth. He made his film debut in a leading role with Donga Dongadi in 2004.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X