మంచు ఫ్యామిలీలో గొడవలు .. ఓ పక్క కొట్టుకుంటుంటే, మోహన్ బాబు వింత ప్రవర్తన
ప్రస్తుతం తెలుగు సినిమా దగ్గర ఓ రేంజ్ లో హైలైట్ గా మారి వినిపిస్తున్న పలు అంశాల్లో మంచు వారి కుటుంబంలో జరుగుతున్న రగడ కూడా ఒకటి. ఒక పక్క పొలిటికల్ గా మరో పక్క సినిమాల పరంగా కూడా కొందరు సినీ ప్రముఖులు కాంట్రవర్సీలతో సోషల్ మీడియా అంతా రచ్చ రచ్చ నడుస్తుంది అని చెప్పాలి.
కాగా మంచు వారి కుటుంబంలో నడుస్తున్న హై డ్రామా పట్ల ఒకింత ఊహించని పరిణామాలు వారి ఫ్యామిలీ మార్క్ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ కూడా కనిపిస్తుంది. అయితే సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు అలాగే తన కొడుకులు ఇద్దరు మంచు విష్ణు అలాగే మంచు విష్ణు నడుమ కూడా పలు షాకింగ్ ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి.

మంచు మనోజ్ సంచలన ఆరోపణలు చేస్తూ తన తండ్రి సైడ్ నుంచే ప్రమాదం ఉందని అలాగే షాకింగ్ నిజాలు బయటకి చెప్పాడు. అలాగే ఈ టెన్షన్ నడుమ జరుగుతున్న హై డ్రామాలో మంచు మనోజ్ అన్న మంచు విష్ణు ఎంటర్ కావడంతో ఈ హీట్ మరింత ఎక్కువ అయ్యిందని చెప్పాలి. తాను విదేశాల నుంచి వచ్చాక మంచు మనోజ్ ని ఇంటి నుంచి బయటకి గెంటేసాడని అతని భార్యని కూడా బయటకి నెట్టేశాడు అంటూ ఫిలింనగర్‌లో షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ఈ నేపథ్యంలో మంచు విష్ణు ఎంట్రీ దెబ్బకి ఇంకో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక పక్క అంతా మంచి హైడ్రామా నడుస్తుంటే ఇంకోపక్క మంచు మోహన్ బాబు నుంచి మాత్రం ఊహించని పోస్ట్ లు విచిత్రంగా వస్తున్నాయి అని చెప్పాలి. మనోజ్ ఏమో నాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి నన్ను , నా ఫ్యామిలీని కాపాడండి మొర్రో అని మొర పెట్టుకుంటూ ఉంటే...
మోహన్ బాబు మాత్రం తన సోషల్ మీడియాలో నాన్ స్టాప్ గా తన పాత సినిమాల పోస్ట్ లు, పాత సినిమాల తాలూకా వర్క్ ఎక్స్ పీరియన్స్ , వాటి స్మృతులు షేర్ చేసుకుంటూ గడిపేస్తున్నారు. అసలు తమ ఫ్యామిలీలో ఏమీ జరగనట్టే ఆయన సింపుల్ గా పోస్ట్ లు పెడుతూ ఏం పట్టనట్టే ప్రవర్తించడం సినీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
కొద్దిరోజుల క్రితం సూపర్ స్టార్ రజినీకాంత్ కథ ఇచ్చిన సినిమా రాయలసీమ రామన్న చౌదరి గురించి చెప్పిన మోహన్ బాబు. తర్వాత 'కోరికలే గుర్రాలైతే', 'శ్రీ రాములయ్య' నేడు "ప్రతిజ్ఞ" అంటూ పోస్ట్ చేస్తూ వచ్చారు. దీనితో ముందు ఇంట్లో సమస్యలు పరిష్కరించుకోండి.. మీ కొడుకు మనోజ్ కోసం కూడా కొంచెం ఆలోచించండి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండగా మంచు విష్ణు ఎంట్రీతో వీరి కుటుంబ గొడవలు సెటిల్ చేసుకునే యత్నం కూడా నెమ్మదిగా మొదలైనట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి చూడాలి మంచు ఫ్యామిలీలో గొడవలకి ఎలాంటి ఎండింగ్ వస్తుంది అనేది.


Click it and Unblock the Notifications











