ఆడబిడ్డకు ఆస్తి రాసిస్తా.... పిరికిపందల్లా బతకొద్దు, మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్
2024కి ముగింపు పలికి త్వరలో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న దశలో తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేగింది. విలక్షణ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు కుటుంబంలో గొడవలతో ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. తనపై తండ్రి దాడి చేశాడని మనోజో.. తనపై కొడుకు చేయి చేసుకున్నాడని మోహన్ బాబులు పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అదంతా అవాస్తవమేనంటూ మంచు ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చింది.
మంచు కాంపౌండ్ నుంచి ఈ ప్రకటన వచ్చిన గంటల వ్యవధిలోనే మనోజ్ బాబు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. మెడకి కట్టు, కాలికి గాయంతో నడవటానికి కూడా ఇబ్బంది పడుతూ భార్య, మరో వ్యక్తితో కలిసి కుంటుకుంటూ లోపలికి వెళ్లారు మనోజ్. దీంతో గొడవ నిజమేనా? లేక ప్రమాదవశాత్తూ ఆయన గాయపడ్డారా? అంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. చికిత్స తర్వాత ఆదివారం అర్ధరాత్రి సమయానికి మనోజ్ డిశ్చార్జ్ అయినట్లుగా తెలుస్తోంది.

ఈ పరిణామాలతో మంచు కుటుంబంలో ఏదో జరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు దుబాయ్‌లో ఉండగా.. ముంబైలో ఉన్న కుమార్తె లక్ష్మీ ప్రసన్న కూడా ఈ విషయం తెలిసి హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అటు మోహన్ బాబు నివాసానికి భారీగా బౌన్సర్లు చేరుకోవడంతో మంచు కుటుంబంలో ఏం జరగబోతోంది అన్న ఆందోళన నెలకొంది.
ప్రధానంగా ఆస్తుల పంపకం, ఈ కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ విద్యానికేతన్, మోహన్ బాబు యూనివర్సిటీ తదితర సంస్థల అప్పగింతకు సంబంధించి మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని ఫిలింనగర్ టాక్. అయితే కొద్దిరోజుల క్రితమే మోహన్ బాబు ఆస్తుల్ని పంచేశారని కూడా కొందరు అంటున్నారు. ఈ క్రమంలో ఓ రోజున రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మోహన్ బాబు కనిపించడం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
కాగా.. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ బాబు ఆస్తుల పంపకం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నా ముగ్గురు బిడ్డలకు ఆస్తుల్ని సమానంగా పంచుతానని .. కానీ లక్ష్మీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని , అలాగే నా ముగ్గురు మనవరాళ్లు అంటే నాకు చాలా ఇష్టమని మోహన్ బాబు స్పష్టం చేశారు. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని, పిరికిపందల్లా బ్రతకొద్దని ఆయన సూచించారు. ఎవడైనా వచ్చి చేయి పట్టుకుంటే వాడి పళ్లు రాలిపోవాలి లేదంటే ఒక్క దెబ్బకు చావాలని మోహన్ బాబు అన్నారు. నా విద్యాసంస్థల్లోని ఆడపిల్లలకు సైతం ఇదే విషయాన్ని చెబుతానని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మోహన్ బాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











