ఎన్ని జన్మలైనా నువ్వే నా కూతురిగా పుట్టాలి.. మోహన్ బాబు ఎమోషనల్ కామెంట్

మంచు మోహన్ బాబు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా కనిపించకపోయినా అప్పుడప్పుడు ఆయనకు నచ్చిన సెలబ్రెటీల పుట్టినరోజున స్పెషల్ బర్త్ డే విషెస్ తో ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక ఈ రోజు ఆయన తన గారాల కూతురి పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ విషెస్ తో నెటిజన్స్ ని ఆకట్టుకున్నారు. అలాగే మాణిక్యం లాంటి కుమార్తె అంటూ మంచు లక్ష్మి గొప్పతనం గురించి ఇంగ్లీష్, తెలుగులో చాలా ప్రేమగా వివరించారు. అలాగే చిన్ననాటి ఒక ఫొటోను

నా ముద్దుల కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న వజ్ర వైడూర్య పుష్య గోమేదిక మరకత మాణిక్యం లాంటి కుమార్తె పుట్టినరోజు ఈ రోజు. మరొక జన్మంటూ ఉంటుందో లేదో తెలీదు గానీ ఉంటే మళ్ళీ ఈ లక్ష్మీ ప్రసన్నే నాకు కూతురిగా పుట్టాలని, నేను తనకు తండ్రిగా పుట్టాలని ఆ పంచబుతాల్ని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే టు మై డియర్ లవ్లీ లక్ష్మీ మంచు. ఎన్ని జన్మలైనా నువ్వు నా కూతురిగా పుట్టాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా... లవ్యూ.. అంటూ మోహన్ బాబు వివరణ ఇచ్చారు.

Manchu mohan babu special birthday wishes for manchu lakshmi

ప్రస్తుతం మోహన్ బాబు చేసిన బర్త్ డే ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నటుడిగా మోహన్ బాబు చాలా నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. ఆఫర్స్ చాలానే వస్తున్నాయి గాని కేవలం ఆయనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తున్నారు. 2018లో చివరగా మహానటి సినిమాలో ఎస్వీ.రంగారావు పాత్రలో కనిపించిన మోహన్ బాబు ఇటీవల సూర్య ఆకాశమే నీ హద్దురా అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 30న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X