మంచు వారి పంచదార కాంట్రవర్సీలో బిగ్ ట్విస్ట్ .. మనోజ్‌కి షాకిచ్చిన తల్లి
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి పలువురు సినీ ప్రముఖులకు సంబంధించి ఎలాంటి రచ్చ నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక పక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంట్రవర్సీ అలాగే ఇంకో పక్క మంచు కుటుంబంలో గొడవలు రోజుకొక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటూ వస్తున్నాయి. అయితే మంచు మోహన్ బాబు అలాగే ఆయన కుమారులు మంచు విష్ణు అండ్ మంచు మనోజ్ విషయంలో జరుగుతున్న హంగామా అంతా ఇంత కాదు.
ఓ పక్క మెహన్ బాబు కూడా మీడియా వాళ్లపై చేయగా.. ఇంకో పక్క మంచు విష్ణు తన ఇంటికి వచ్చి జెనరేటర్స్‌లో పంచదార పోసి ఇంటికి కరెంట్ తీసేసేలా చేశాడంటూ షాకింగ్ వీడియో ఫుటేజ్‌ని విడుదల చేసాడు. తన అన్న నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు అంటూ మనోజ్ ఆరోపణలు చేయడంతో చాలా మంది అతనిపై సింపతి కూడా చూపించాడు.

అయితే ఇపుడు మంచు కుటుంబంలో ఒక్క మంచు లక్ష్మి అలాగే మోహన్ బాబు భార్య నిర్మల మినహా మిగతా అంతా కూడా ఈ గొడవలపై మాట్లాడారు. కానీ ఇపుడు బిగ్ ట్విస్ట్ ఇస్తూ మోహన్ బాబు భార్య అందరికీ షాకిచ్చారు. తన అన్న పంచదార పోసి ఇబ్బంది పెట్టాడు అంటూ మనోజ్ ఏదైతే పోలీసుకి కంప్లైంట్ చేసాడో ఇపుడు అదే పోలీసు వారికి వారు తల్లి, మోహన్ బాబు భార్య నిర్మల మంచు మనోజ్ పై కంప్లైంట్ చేయడం షాకింగ్ గా మారింది.
అందులో అసలు ఆరోజు ఏం జరిగిందో పూస గుచ్చినట్టుగా వెల్లడించారు. "డిసెంబరు 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు విష్ణు మంచు .. జల్‌పల్లి ఇంటికి వచ్చి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేసాడు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ .. ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్‌ని బయటపెట్టి, దాన్ని అతను గొడవ చేసినట్టు లేనిపోని అభాండాలు వేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
తాను చెప్పదలచుకున్నది ఏంటంటే, నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకుని ఇంటికి వచ్చి, తన రూమ్‌లో ఉన్న వస్తువులు కొన్ని తీసుకున్నాడు. ఉన్న కొద్దిసేపు నాతోనే ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసాడు, నా చిన్న కొడుకైన మనోజ్ కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుకు అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉన్నది.

విష్ణు ఎలాంటి దౌర్జన్యంతో కానీ, మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో నిజం లేదు. ఈ ఇంట్లో పని చేస్తున్న వాళ్ళు కూడా మేమిక్కడ పని చేయలేమని, వాళ్ళే మానేసారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంతమాత్రం లేదని ఆమె తేల్చేశారు.
విష్ణు మా జల్‌పల్లిలోని ఇంటికి వచ్చాడు. నా పుట్టిన రోజు సెలబ్రేట్ చేశాడు. విష్ణు గదిలో వున్న తన సామాను తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంతకు మించి ఇక్కడ జరిగింది ఏమీ లేదని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు నిర్మల. మొత్తం మీద మంచు ఫ్యామిలీ గొడవల్లో ఆమె ఒక ఊహించని ట్విస్ట్‌ని ఇచ్చారు. తాను ఇచ్చిన స్టేట్‌మెంట్ సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాలలో ఊహించని విధంగా చర్చకు దారి తీసింది.


Click it and Unblock the Notifications











