కన్నప్పను ఎగతాళి చేసిన మనోజ్.. మంచు విష్ణు రియాక్షన్ ఏంటో తెలుసా?
మంచు ఫ్యామిలీ గొడవలు కాస్తా సర్దుమణిగాయి. మంచు కుటుంబ మళ్లీ ఎప్పుడు ఒకటైపోతుందని, అందరూ సంతోషంగా ఎప్పుడు కలిసి ఉంటారోనని అభిమానులు, వారి శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో మంచు మనోజ్ మాత్రం ఆయా వేదికలపై కుటుంబ విషయాల గురించి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. మళ్లీ తన తండ్రికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఆయన ప్రసంగాల తీరు కూడా అలానే కనిపిస్తోంది. అయితే ఇదే సమయంలో మంచు మనోజ్ తన అన్న మంచు విష్ణు సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేయడం, అందుకు మంచు విష్ణు కూడా స్పందించడంతో ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గ్గా మారింది.
మంచు ఫ్యామిలీ గొడవలు..
మంచు ఫ్యామిలీలో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మనోజ్ పెళ్లి తర్వాత నుంచి అవి ఇంకా తారా స్థాయికి చేరకున్నాయి. ఏకంగా మనోజ్ ను ఇంట్లోని కట్టుబట్టలతో వెళ్లగొట్టం, మంచు మోహన్ బాబు కూడా మీడియా ముందే కొడుపై తాండవం ఆడటం, మనోజ్ కూడా ఏమాత్రం తగ్గకుండా సవాల్ చేయడం, పరస్పరం కేసులు కూడా పెట్టుకోవడం ఒకింత అభిమానులు, వారి శ్రేయోభిలాషుల్లో ఆందోళనను కలిగింది. మర్యాదకు మారు పేరులా ఉన్న ఆ ఇంటిలో అసలు ఎందుకు గొడవలు వచ్చాయనేది అంతా సస్పెన్స్ గా మారింది. కానీ మనోజ్ మాత్రం ఆస్తి కోసం కాదని, ఆత్మ గౌరవం కోసమే తన పోరాటమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇక అంతటితో గొడవలు సర్దు మణిగాయి.

అన్నాదమ్ముల సినిమాలపై ప్రభావం..
మంచు మనోజ్, మంచు మోహన్ బాబు మధ్య జరిగిన పరస్పర కేసుల తర్వాత కాస్తా గొడవ సర్దుమణిగింది అనుకుంటే తాజాగా తమ సినిమాల ప్రచారంలో మళ్లీ మొదలైందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అందుకు కారణం తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్న సందర్భంలో ఫ్యామిలీ గొడవలపైనా స్పందించడం చర్చకు దారి తీసింది. దీంతో వీరి సినిమాలపైనా ప్రభావం పడుతుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కానీ వారి వ్యక్తిగత విషయాలతో సినిమాలకు పెద్ద మైనస్ కాదనే అంటున్నారు. కంటెంట్ ఉంటే సినిమా సక్సెస్ ను ఆపలేదరని ప్రముఖులు తెలియజేస్తున్నారు.
మనోజ్ ఏమన్నాడు.. విష్ణు ఎలా స్పందించాడు..
రీసెంట్ గా మనోజ్ తన రాబోయే చిత్రం భైరవం ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. భైరవం సాంగ్ లాంచ్ ఈవెంట్ లో మనోజ్ మాట్లాడుతూ తన అన్న మంచు విష్ణు నటించిన ప్రతిష్టాత్మకమైన చిత్రం కన్నప్పపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అందులో విష్ణు శివయ్యా అంటూ పిలవడాన్ని వేదికపై ఇమిటేట్ చేసి ట్రోల్ చేశాడు. ఇక ఆ తర్వాత మంచు విష్ణు కూడా మనోజ్ కామెంట్స్ పై స్పందించారు. కానీ ఎలాంటి నెగెటివ్ కామెంట్స్ చేయలేదు. కన్నప్ప సినిమాతో పాటు తన తమ్ముడు భైరవం సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నట్టు చెప్పి హుందా తనాన్ని చూపించారు. ఇక తాజాగా మనోజ్ కూడా స్పందిస్తూ కన్నప్ప కూడా విజయం సాధించాలని, ఏదో కోపంలో అలా అన్నాను కానీ ఆ సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు.
భైరవం.. కన్నప్ప రిలీజ్ ఎప్పుడు?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - అదితి శంకర్ హీరో హీరోయిన్లుగా విజయ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'భైరవం'. నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ ముగ్గురు హీరోలను వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మే30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటున్న కన్నప్ప చిత్రం 2025 జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











