200 కోట్లు ఇస్తా... ఆస్కార్ ఇప్పించండి.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

మంచు విష్ణు త్వరలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'తో అలరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేస్తూ మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే భారీ తారాగణంతో షూటింగ్ పూర్తి చేసిన టీమ్.. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను అందిస్తూ సినిమాపై హైప్ ను పెంచుతున్నారు. ఇప్పటి వరకు 'కన్నప్ప' నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కు ఆడియెన్స్ నుంచి మాసీవ్ రెస్పాన్స్ దక్కుతుండటం విశేషం.

ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈచిత్రంపై మరింతగా అంచనాలు పెంచేలా మంచు విష్ణు ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుండటంతో ఇప్పటి నుంచే మంచు విష్ణు ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రెస్ మీట్లు, ఈవెంట్లు, స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తున్నారు. మరోవైపు మంచు విష్ణు చేస్తున్న కామెంట్స్ కూడా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక తాజాగా ఆస్కార్ అవార్డ్స్ గురించి మంచు విష్ణు ఇలా మాట్లాడారు.

Manchu Vishnu about RRR movie to got Oscar Award Here is His Shocking comments

ఎప్పుడైనా సినిమా సక్సెస్ కావాలంటే కచ్చితంగా ఆ సినిమాకు సంబంధించిన కథ, కథనంపైనే ఆధారపడి ఉంటుందని నమ్ముతున్నాని చెప్పారు. ఎంత అద్భుతంగా స్టోరీ టెల్లింగ్ ఉంటుందో ఆడియెన్స్ నుంచి ఆ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతుందని తెలిపారు. అంతే కానీ మరే ఇతర అంశాలు పెద్దగా వర్కౌట్ కావని చెప్పారు. ఇక బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రలను ఉదహరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ అవార్డు రావడంపైనా మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్ చేశారు.

2023లో 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని 'నాటు నాటు' సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. తొలిసారిగా ఇండియా గడ్డపై ప్రపంచ సినీ రంగంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఆస్కార్' అవార్డు అడుగుమోపడంతో టాలీవుడ్ కీర్తి మరింతగా పెరిగింది. అయితే 'నాటు నాటు' కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. సంగీత ప్రియులకు నాటుదనాన్ని పరిచయం చేసింది. లిరిక్స్, మ్యూజిక్, కొరియోగ్రఫీ ఓ రేంజ్ లో ఉండటంతో ఆస్కార్ వరించింది. ఇక ఇదే విషయాన్ని తాజాగా మంచు విష్ణు గుర్తు చేశారు.

'ఆర్ఆర్ఆర్' చిత్రానికి ఆస్కార్ వచ్చిన సందర్భంలోనూ చాలా విమర్శలు వచ్చాయన్నారు. ఆ మాత్రం ఖర్చుపెడితే ఎవ్వరికైనా ఆస్కార్ వస్తుందని అప్పుడు చాలా మంది అనడాన్ని విష్ణు గుర్తు చేశాడు. అది ఖర్చుపెడితే వచ్చే అవార్డు కాదని చెప్పారు. తాను కూడా రూ. 200 కోట్లు ఇస్తానని.. ఎవరైనా ఆస్కార్ ఇఫ్పించండి చూద్దామంటూ సవాల్ విసిరారు. ఇక సినిమాను సినిమాల చూడాలే తప్ప ఓవర్ ఎనాలసిస్ చేయొద్దన్నారు. అలాగైతేనే సినిమాను ఎంజాయ్ చేయగలరని సూచించారు.

ఇక కన్నప్ప చిత్రాన్ని రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ తో మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఏవీఏ ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ మొత్తం న్యూజిలాండ్ లోనే జరగడం విశేషం.ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్ కూడా విడుదలై ఆకట్టుకున్నాయి. ఇక ప్రభాస్ రుద్రగా 30 నిమిషాలపాటు కనిపించబోతుండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ సొంతమైంది. 'శివా శివా శంకర' సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.

More from Filmibeat

Read more about: manchu vishnu kannappa rrr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X