twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతిపెద్ద స్కామ్‌లో మంచు విష్ణు.. వైరల్ పోస్టర్

    |

    మంచు విష్ణు కెరీర్ ఎలా మొదలైంది.. ఇప్పుడు ఎలా ఉందన్న సంగతి గురించి తెలిసిందే. గత కొంత కాలం నుంచి విష్ణు.. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఒక్క సినిమా కూడా హిట్ కావడం లేదు. చివరగా ఓటర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆ తర్వాత విష్ణు నుంచి ఓ హాలీవుడ్ రేంజు సినిమా వస్తోంది అంటూ ప్రచారం వేడెక్కించిన సంగతి తెలిసిందే.

    హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ జీ చిన్ దర్శకత్వం మోసగాళ్లు మొదలైంది. ఈ మూవీ గురించి రక రకాల వార్తలు రాగా.. నేడు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ కథతో! అంటూ పోస్టర్ పై ముద్రించడం చూస్తుంటే నిజఘటనల కథతో ఆసక్తికర సినిమాని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఈనెల 24న విష్ణు బర్త్ డే సందర్భంగా ఈ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అర్జున్ పాత్రలో విష్ణు లుక్ ఆకట్టుకుంది. తెలుగు- ఇంగ్లీష్ సహా పలుభాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. 2020 వేసవిలో రిలీజ్ చేస్తున్నామని చిత్రబృందం వెల్లడించింది.

     Manchu Vishnu And Jeffrey Gee Chin Movie Is Mosagallu

    వరల్డ్ బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ తో సినిమా అంటే.. కథాంశం ఏమై ఉంటుంది? అన్న ఆసక్తి మొదలైంది. మరి విష్ణు ఎంచుకున్న స్కామ్ ఏమిటి? అన్నది రివీల్ కావాల్సి ఉంది. ఐటీ స్కామ్ అంటే సత్యం కంప్యూటర్స్ కుంభకోణం గురించి తెలుగు ప్రజలకు తెలుసు. బహుశా అలాంటి కథతోనే విష్ణు ప్రయోగం చేస్తున్నాడేమో? చూడాలి. అంతేకాకుండా ఇందులో క్రైమ్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్క‌లంగా ఉంటాయ‌ని సమాచారం.

    English summary
    Manchu Vishnu New Movie With Hollywood director Jeffrey Gee Chin Is Mosagallu. Kajal Aggerwal Is Fenale Lead. This Movie Is Based On Worlds Biggest It Scam. This Is going To Relaese On 2020 Summer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X