బెడ్‌పై మోహన్‌ బాబు, మంచు ఫ్యామిలీకి కొండంత కష్టం.. నేనున్నానంటూ బాలయ్య

ఆస్తి పంపకాలు, కాలేజీ గొడవలు .. కారణాలు ఏమైనా మంచు ఫ్యామిలీలో పరిస్థితులు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. మనోజ్ - మోహన్ బాబులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో విషయం పోలీస్ స్టేషన్లు దాటి కోర్టుల వారికి వచ్చింది. ఈ మధ్యలో జర్నలిస్టుపై దాడితో మోహన్ బాబు మరో వివాదంలో చిక్కుకున్నారు. పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరుగుతూ మోహన్ బాబుకు ఈ విషయంలో మన:శాంతి లేకుండా పోయింది.

ఓ సాధారణ వ్యాయామ ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించిన మోహన్ బాబు .. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్రనటుల్లో ఒకరిగా, నిర్మాతగా ఎదిగారు. వందలాది చిత్రాల్లో నటించిన అరుదైన నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. నటనతో పాటు ఆయన బేస్ వాయిస్, డైలాగ్ డెలివరీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పేజీలకొద్దీ డైలాగ్స్‌ను గుక్క తిప్పుకోకుండా సింగిల్ టేక్‌లో చెప్పగలడంలో మోహన్ బాబు సిద్దహస్తుడు.

Manchu Vishnu and Manchu Lakshmi Prasanna told Nandamuri Balakrishna about Mohan Babu s accident

స్వతహాగా మోహన్ బాబు మంచి మనిషని ఇండస్ట్రీలో వినిపించే మాట. కాకపోతే ముక్కుసూటితనం, మనసులో ఉన్నది కుండబద్ధలు కొట్టడం వంటి వాటితోనే ఆయన ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. నిర్మాత బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుందని నమ్మే వ్యక్తి మోహన్ బాబు. తొలినాళ్లలో విలన్‌ వేషాలతో బిజీగా ఉన్న ఆయన స్టార్ హీరోలకు ప్రతినాయకుడిగా నటించారు. విలన్ క్యారెక్టర్లు అంటేనే తనకు ఎంతో ఇష్టమని పలుమార్లు చెప్పారు కూడా.

అన్న నందమూరి తారక రామారావుకు వీరాభిమాని అయిన మోహన్ బాబు తన అభిమాన నటుడితో కలిసి నటించడమే కాదు, ఆయనతో సినిమా కూడా నిర్మించి తన కోరిక తీర్చుకున్నారు. నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితుల్లో మోహన్ బాబు కూడా ఒకరు. ఎన్టీఆర్‌తో పాటు ఆయన కుమారులు, కుమార్తెలతో కలెక్షన్ కింగ్‌కి అనుబంధం ఉంది. ప్రత్యేకించి నందమూరి బాలకృష్ణతో సోదరుడిలా మెలుగుతుంటారు.

బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోకు ఓ రోజున మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న, మంచు విష్ణు గెస్ట్‌లుగా వచ్చారు. ఈ సందర్భంగా బాలయ్యతో తమకున్న అనుబంధాన్ని వీరు గుర్తుచేసుకున్నారు. దొంగరాముడు షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో మోహన్ బాబుకు మెడ మీద పెద్ద గాయం అయ్యిందని లక్ష్మీ ప్రసన్న తెలిపారు. హాస్పిటల్ బెడ్ మీద బాలయ్య నువ్వే మా పిల్లలకు దిక్కు అని నాన్న అప్పగింతలు చెబుతుండటంతో మేం కంగారు పడ్డామని ఆమె వెల్లడించారు.

మేం చాలా చిన్నపిల్లలమని ఆ వెంటనే బాలయ్య మమ్మల్ని బజారు తీసుకెళ్లి బొమ్మలు కొనిచ్చారని లక్ష్మీ చెప్పింది. నాన్నగారికి గాయం అయిన తర్వాత ఇంటికొచ్చి మా అమ్మతో మాట్లాడిన దృశ్యం ఇంకా గుర్తుందని విష్ణు అన్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంస్కారం ఎవరికీ లేదని, మీరు రావాల్సిన అవసరం కూడా లేదని లక్ష్మీ ప్రసన్న అనడంతో మనమంతా ఓ కుటుంబమని బాలయ్య చెప్పారు. ప్రస్తుతం వీరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X