మెగా హీరోకు మంచు విష్ణు కౌంటర్.. నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందంటే!

మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్‌పై, మరో యంగ్ హీరో మంచు విష్ణు కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. తమ్ముడు మై లిటిల్ బ్రదర్ అంటూ మంచు విష్ణు గట్టి గానే కౌంటర్ వేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ మెగా మేనల్లుడుపై మంచు విష్ణు కౌంటర్ ఎందుకు వేయాల్సి వచ్చింది? ఆ కౌంటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

సోలో బ్రతుకే సో బెటర్.. మెగా మేనల్లుడి ట్వీట్

సోలో బ్రతుకే సో బెటర్.. మెగా మేనల్లుడి ట్వీట్

గత కొంతకాలంగా సక్సెస్ లేక సతమతమవుతున్న సాయి ధరమ్ తేజ్.. ఇటీవలే 'ప్రతీ రోజు పండగే' సినిమాతో సక్సెస్ సాధించాడు. దీంతో తన తదుపరి సినిమా 'సోలో బ్రతుకే సో బెటర్' సెట్స్ పై చాలా ఉత్సాహంగా కదులుతున్నాడు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్ పైనే మంచు విష్ణు రియాక్ట్ అయ్యాడు.

 సింగిల్‌ జీవితం.. సాయి ధరమ్ తేజ్ మెసేజ్

సింగిల్‌ జీవితం.. సాయి ధరమ్ తేజ్ మెసేజ్

ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే రాబోతోంది. సో.. వాలంటైన్ వీక్ సందర్భంగా సోలో బ్రతుకు గురించి సాయి ధరమ్ తేజ్ ఓ ఫిలాసఫీ చెబుతూ కొన్ని పాయింట్స్ రాశాడు. సింగిల్‌గా ఉంటే లాభాలు ఏంటి? సోలో జీవితం ఎలా ఉంటుందనే దానిపై పాయింట్స్ రాసిన ఆయన.. వాటిని ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నాడు.

మంచు విష్ణు కౌంటర్.. తమ్ముడు మై లిటిల్ బ్రదర్ అంటూ!

మంచు విష్ణు కౌంటర్.. తమ్ముడు మై లిటిల్ బ్రదర్ అంటూ!


ఈ ట్వీట్ చూసిన మంచు విష్ణు, సాయి ధరమ్ తేజ్‌కు గట్టి కౌంటరే ఇచ్చాడు. ''తమ్ముడు మై లిటిల్ బ్రదర్ సాయి తేజ్.. ఈ ట్వీట్ నేను సేవ్ చేసుకున్నాను. ఇంకా ఎన్ని రోజులు ఇలా సోలోగా ఉంటావో చూస్తాగా. ఆల్ ది బెస్ట్ ఫర్ సోలో బ్రతుకే సో బెటర్'' అంటూ రియాక్ట్ అయ్యాడు.

కూల్‌గా సాయి ధరమ్ తేజ్..

కూల్‌గా సాయి ధరమ్ తేజ్..


విష్ణు ఇచ్చిన ఈ కౌంటర్ పై సాయి ధరమ్ తేజ్ కాస్త కూల్‌గా సమాధానమిచ్చాడు. విష్ణు అన్నా.. మీ మాదిరిగా అందరికీ అదృష్టం ఉండాలి కదా! అనేశాడు మెగా మేనల్లుడు. ఇలా ఈ ఇద్దరు యంగ్ హీరోల మధ్య సోలో బ్రతుకు గురించి జరిగిన ఈ సంభాషణ యువతను బాగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

విష్ణు సార్ మీ లక్ కొంచెం నాకు కూడా ఇవ్వండి


మంచు విష్ణు చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ''ఎస్ ఇట్ ఈజ్ ట్రూ.. విష్ణు సర్ మీరు చాలా లక్కీ.. విష్ణు సార్ మీ లక్ కొంచెం నాకు కూడా ఇవ్వండి సార్'' అంటూ రియాక్ట్ అవుతున్నారు. అలాగే విష్ణు సినిమాల కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొంటున్నారు.

సోలో బ్రతుకే సో బెటర్ మూవీ ముచ్చట్లు


యూత్ నచ్చే, మెచ్చే కథాశంతో వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ యెన్ ప్రసాద్ ‘సోలో బ్రతుకే సో బెటర్' సినిమాను నిర్మిస్తున్నాడు. కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా మే 1న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X