గీతా ఆర్ట్స్‌పై మంచు విష్ణు సీరియస్? కన్నప్ప మూవీపై ట్రోల్స్‌పై ఫిర్యాదు!

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్, కల్యా ఫిల్మ్స్ బ్యానర్లపై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరీ నిర్మిస్తున్న చిత్రం సింగిల్. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీకి అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా మే 9వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్‌లో కొన్ని డైలాగ్స్ కొందరు సినీ ప్రముఖులను కించపరిచేలా ఉండటం వివాదంగా మారే అవకాశం కనిపిస్తున్నది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

లవ్, రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో అర్జున్ రెడ్డి, యానిమల్, కన్నప్ప లాంటి మరికొన్ని సినిమాలను, అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరు సినీ ప్రముఖులు కొట్టిన డైలాగ్స్‌ను ట్రోల్ చేసే విధంగా ట్రైలర్‌లో చూపించడంపై సినీ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో కొన్ని డైలాగ్స్‌ను, కొందరు హీరోలను కించపరిచే విధంగా వాడటంపై సదరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Manchu Vishnu Complaint on Single Movie

పూర్తిస్థాయి కామెడీ మూవీగా అనిపించిన సింగిల్ సినిమాలో కన్నప్పలో మంచు విష్ణు చెప్పిన శివయ్య అనే డైలాగ్‌ను ఈ ట్రైలర్‌లో ట్రోల్ చేసినట్టు పెట్టారు. అలాగే మంచు అనే పదాన్ని కూడా ఆ ఫ్యామిలీని టార్గెట్ చేసినట్టు కనిపించింది. అయితే ఈ విషయంపై ట్రైలర్ రిలీజ్ ప్రెస్ మీట్‌లో మీడియా ప్రస్తావించగా.. ఇవియే కాదు.. ఇంకా మరికొంత మంది హీరోలు, సినిమాల ప్రస్తావన ఉంటుందని హీరో శ్రీ విష్ణు చెప్పారు. అయితే ఎవరినీ నొప్పించే ఉద్దేశం మాకు లేదని స్పష్టం చేశారు.

అయితే సింగిల్ మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాత పలు అంశాలపై కొందరి మనోభావాలు దెబ్బ తిన్నాయనే విషయం సోషల్ మీడియాలో కనిపించింది. అయితే శివయ్య డైలాగ్‌ను, మంచు అనే పదాలను ఉపయోగించడంపై హీరో మంచు విష్ణు మనస్తాపం చెందడం కాకుండా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారని తెలిసింది. అయితే ఈ విషయం గురించి చిత్ర యూనిట్‌తో మాట్లాడేందుకు సిద్దమవుతున్నట్టు తెలిసింది.

అయితే తమ కుటుంబ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా, అలాగే రాబోయే కన్నప్ప చిత్రాన్ని ట్రోల్ చేసే విధంగా డైలాగ్స్‌ను ఉపయోగించడంపై మంచు విష్ణు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే ఈ వ్యవహారంపై గీతా ఆర్ట్స్, మూవీ నిర్మాతలపై ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, తదితర సంస్థలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా మంచు విష్ణు స్పందిస్తే గానీ.. ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

ఇదిలా ఉండగా, శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా జంటగా నటించిన సింగిల్ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది. వేసవిలో మరో మంచి ఎంటర్‌టైనర్ రాబోతున్నదనే విషయాన్ని కంటెంట్ చెప్పింది. వెన్నెల కిషోర్, శ్రీ విష్ణు కాంబినేషన్ మరోసారి ఈ సినిమాకు ప్లస్ కాబోతున్నదనే సంకేతాలను అందించింది. అయితే ఈ వివాదాస్పద అంశాలపై ఎలాంటి స్పందన వస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X