డీ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన విష్ణు.. టైటిల్ అదిరింది.. శ్రీహరి పాత్రలో ఎవరంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హిట్టు సినిమాల సీక్వెల్స్ పరంపర కొనసాగుతోంది. ఒకప్పుడు బాలీవుడ్ లోనే సీక్వెల్స్ ఎక్కువగా వచ్చేవి. కోలీవుడ్ లో కూడా ఆ డోస్ ఎక్కువైంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఎంటర్టైన్మెంట్ సినిమాల సీక్వెల్స్ బ్యాక్ టూ బ్యాక్ రెడీ అవుతున్నాయి. ఇక ఆల్ టైమ్ బెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాల్లో ఒకటైన డీ సీక్వెల్ కూడా త్వరలో రాబోతున్నట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది.

విష్ణు కెరీర్ లో బెస్ట్ మూవీ

విష్ణు కెరీర్ లో బెస్ట్ మూవీ

విష్ణు కెరీర్ లో సక్సెస్ చూసిన సందర్భాలు చాలా తక్కువ. ఇక అతనికి బెస్ట్ మూవీ ఏది అంటే ఢీ అనే చెప్పాలి. ఈ హీరో అలాంటి హిట్టు ఇంతవరకు అందుకోలేదు. ఆ ఒక్క సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడనే చెప్పాలి. దర్శకుడు శ్రీను వైట్ల రేంజ్ కూడా ఆ సినిమాతోనే పెరిగింది. 2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా అప్పట్లో సమ్మర్ బిగెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్.. వారి టాలెంట్ తో ఆడియెన్స్ ని ఎంతగానో అలరించారు.

డి & డి డబుల్ డోస్

డి & డి డబుల్ డోస్

ఇక ఫైనల్ గా ఆ సినిమా సీక్వెల్ పై చిత్ర యూనిట్ ఒక క్లారిటీ ఇచ్చేసింది. గత కొంతకాలంగా సినిమాపై వస్తున్న రూమర్స్ నిజమని ఈ సారి "డి & డి డబుల్ డోస్" అంటూ ఒక పోస్టర్ ని విడుదల చేసి మంచి హైప్ క్రియేట్ చేశారు. ఢీ 2007 ఏప్రిల్ 13న రిలీజ్ అయ్యింది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన అప్డేట్ నవంబర్ 23న రానున్నట్లు ఇటీవల మంచు విష్ణు ఒక పోస్టర్ ను షేర్ చేశాడు.

Recommended Video

Lakshmi Manchu, Rana Daggubati Funny Talk On Rana's Wedding
మంచు విష్ణు స్పెషల్ ట్వీట్

మంచు విష్ణు స్పెషల్ ట్వీట్

ఇక అప్పుడే నెటిజన్లు ఢీ సీక్వెల్ పై క్లారిటీ ఇవ్వబోతున్నట్లు కామెంట్ చేశారు. ఇక ఇప్పుడు పోస్టర్ తో పాటు శ్రీను వైట్లతో ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేశాడు విష్ణు. మరొకసారి నవ్వించడానికి రాబోతున్నామని అంటూ.. ఈ సారి డబుల్ డోస్. మా బిగ్ బ్రదర్ శ్రీనువైట్లతో మరోసారి కలిసి వర్క్ చేయబోతున్నందుకు చాలా ఆసక్తిగా ఉందని విష్ణు ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమాకు భీష్మకు సంగీతం అందించిన మహతి స్వర భాస్కర్ (మణిశర్మ తనయుడు) సంగీతం అంధించనున్నాడు.

ఎలా తెరకెక్కించబోతున్నారు..?

ఎలా తెరకెక్కించబోతున్నారు..?

డీ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్ ఒక విధంగా సంతోషాన్ని ఇచ్చినప్పటికీ సినిమాలోని పాత్రలపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే విషయంలో బిగ్ సస్పెన్స్ ని క్రియేట్ చేసింది. సీక్వెల్ అనగానే అదే పాత్రల్లో కథను కొనసాగించడం లేదా ప్రాంఛైజ్ లాగా వాడుకొని మరొక రకంగా సినిమాను అదే ఫార్మాట్ లో తెరకెక్కిస్తుంటారు. ప్రాంఛైజ్ అన్నప్పుడు పాత్రలు డిఫరెంట్ గా ఉంటాయి. కొత్త తరహా కథ ఉంటుంది.

 శ్రీహరి పాత్ర ఉంటుందా?

శ్రీహరి పాత్ర ఉంటుందా?

డీ అనగానే సీక్వెల్ అయితేనే బావుంటుందని ఆడియెన్స్ బలంగా కోరుకుంటున్నారు. అయితే ఇంకా నటీనటులు గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. డీ సినిమా అంటే మొదటగా గుర్తొచ్చేది శ్రీహరి మాస్ యాక్టింగ్, విభిన్నమైన కామెడీ యాంగిల్.. ఆయన పాత్రకు ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. అలాగే జయప్రకాష్ రెడ్డి కూడా పాత్ర కూడా ఉంటుందా లేదా అనేది మరో బిగ్ సస్పెన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X