ఆ విషయంలో జెనీలియా హర్ట్.. ఆ రోజు దాన్ని అనుభవించాను.. మంచు విష్ణు కామెంట్స్
హీరోయిన్ జెనీలియా ఓ విషయంలో హర్ట్ అయింది. అయితే వెంటన మంచు విష్ణు తన టైమింగ్‌తో ఇట్టే కూల్ చేసేశాడు. ఇంతకీ జెనీలియా ఎందుక హర్ట్ అయిందంటే.. వీరిద్దరి కాంబినేషన్‌లో ఢీ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి తెలియని తెలుగు సినీ ప్రేక్షకులెవరూ ఉండరు. ఎందుకంటే ఈ మూవీ క్రియేట్ చేసిన సంచలనాలు అలాంటివి.అయితే ఈ సినిమా వచ్చి 13 ఏళ్లు అయిన సందర్భంగా మంచు విష్ణు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. అక్కడే జెనీలియా హర్ట్ అయింది. ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం.
శ్రీను వైట్ల ఎమోషనల్ పోస్ట్..
13 ఏళ్ల ఢీని తలుచుకుంటూ.. ‘నా కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రం.. ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌టీ అనిపించినా అందరి సహకారంతో అదో మెమొరబుల్ చిత్రంగా రూపుదిద్దుకుంది. నా నిర్మాతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. విష్ణు, జెనీలియా, శ్రీహరి అన్న, బ్రహ్మానందం గారికి, సునీల్, జేపీ గారి సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. చిత్రానికి పని చేసిన టెక్నీషియన్స్‌కు ధన్యవాదాలు అంటూ శ్రీను వైట్ల ట్వీట్ చేశాడు.
ఆ రోజు దాన్ని అనుభవించా..
ఢీ చిత్రం పదమూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచు విష్ణు ఎమోషనల్ అవుతూ.. ‘ఢీ చిత్రానికి పదమూడేళ్లు.. 13 ఏప్రిల్ 2017న.. ఆనంద బాష్పాలంటే ఏమిటో అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా.. మా తండ్రి మోహన్ బాబు లేకపోతే ఈ సినిమా రిలీజ్ అయ్యేదే కాదు.. మొదటి థ్యాంక్స్ ఆయనకే. వాట్టే మూవీ. కల్ట్ యాక్షన్ కామెడీ మూవీ. శ్రీనువైట్ల లేకపోతే సాధ్యమయ్యేదే కాదు.. మై బిగ్ బ్రదర్..ఢీ 2 ???' ఢీ చిత్రంలోని ఓ పోస్టర్‌ను షేర్ చేశాడు.

హర్ట్ అయిన జెనీలియా..
మంచు విష్ణు ట్వీట్ జెనీలియా ప్రస్థావన లేకపోవడంతోఆమె హర్ట్ అయింది. ఈ మేరక పోస్ట్ నేను నీకు గుర్తున్నానా? అంటూ ట్వీట్ చేసింది. దీనికి స్పందించిన విష్ణు.. ప్రెట్టీ ఉమెన్.. ఫోటోను చెక్ చేశావా? నా చిట్టి ఏంజిల్ నువ్ కళ్లకు ఎప్పటికీ ఆనందాన్నే ఇస్తావ్.. నువ్ ఎప్పటికీ నా టింకర్ బెల్.. అంటూ కూల్ చేసేశాడు.
Recommended Video

ఢీ2 రాబోతోందా??
అయితే ఢీ సినిమాకు సీక్వెల్ రాబోతోందా? అనే అనుమానాలకు తావిచ్చేలా జెనీలియా ట్వీట్ ఉంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ఢీ2 అంటూ జెనీలియా ట్వీట్ చేసింది. అలాగే విష్ణు కూడా శ్రీను వైట్లను ఢీ2 ఎప్పుడు అనే విధంగానే ప్రశ్నించాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











