’ఇల్లు తాకట్టు పెట్టా, బ్యాంక్ లో అప్పు.. కన్నప్ప మూవీని కొనబోమన్నారు’
టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్ట్ 'కన్నప్ప'. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకాచకా కొనసాగుతున్నాయి. ఆ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. విడుదలకు మరికొద్ది రోజుల సమయమే ఉండటంతో ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ ను కూడా జోరుగా నిర్వహించారు. ఈ క్రమంలో ఈవెంట్లు, ప్రెస్ మీట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు మంచు విష్ణు బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ కన్నప్ప చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేస్తున్నారు.
కన్నప్ప చిత్రంపై అంచనాలు ఇలా..
మంచు విష్ణు తన కెరీయర్ లోనే భారీ చిత్రాన్ని నిర్మిస్తుండటం కొంతకాలంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది. ఎవరి ఊహకు అందకుండా భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్ కు ముందు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉండబోతోంది, సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా పెర్ఫామ్ చేయబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మలయాళం స్టార్ మోహన్ లాల్, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రలు నటిస్తుండటంతోనూ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ విజువల్స్ తో నిర్మిస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఆడియెన్స్, సినీ ప్రముఖుల్లో ఆసక్తిని పెంచింది.

హిందీ రైట్స్ విషయంలో మంచు విష్ణకు అవమానం?
కన్నప్ప చిత్రాన్ని ప్రస్తుతం రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ఏర్పాట్లలో మేకర్స్ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హిందీ థియేట్రికల్ రైట్స్ అమ్మకానికి ఓ కార్పొరేట్ కంపెనీకి వెళితే అవమానకరంగా మాట్లాడరని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ముందు డబ్బులు ఇవ్వబోం కానీ.. రిలీజ్ చేయమంటే చేస్తామని చెప్పారంట. దాంతో విష్ణు షాక్ అయ్యి.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడంట. తన సినిమాపై చాలా నమ్మకం ఉందని, నీకు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదని చెప్పి వెనుదిరిగి వచ్చారంట. కానీ ఆ విషయం ఆ కంపెనీ సీఈవోకు తెలిసి సారీ చెప్పారని వివరించారు.
ఇల్లు తాకట్టు పెట్టి సినిమా తీసా.. బడ్జెట్ ఎన్ని కోట్లంటే?
కన్నప్ప చిత్రానికి ఎవ్వరి దగ్గర రూపాయి కూడా అడగ లేదని, తన సొంత డబ్బులతో నిర్మించినట్టు చెప్పారు. ఫెనాన్స్ విషయంలో ఎవరి సాయం లేదన్నారు. బ్యాంక్ లో లోన్ తీసుకొని, తన ఇల్లు తాకట్టు పెట్టుకొని మరీ సినిమాను నిర్మించామని చెప్పాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేశామని వెల్లడించారు.
కన్నప్ప మూవీ తారాగణం, టెక్నీషియన్లు..
కన్నప్ప చిత్రంలో కన్నప్పగా మంచు విష్ణు, మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు, నెమలిగా ప్రీతి ముకుందన్ నటిస్తున్నారు. కిరాటగా మోహన్ లాల్, రుద్రగా ప్రభాస్, శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీగా కాజల్ అగర్వాల్ అలరించబోతున్నారు. మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. సెల్డన్ చావ్ సినిమాటోగ్రాఫర్ గా, ఎడిటర్ గా ఆంథోని, మ్యూజిక్ డైరెక్టర్ గా స్టీఫెన్ దేవస్సీ వ్యవహరించారు. అవా ఎంటర్ టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించారు. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











