మరో నకిలీ వార్త.. ఐటెమ్ రాజా ఇదంతా చేస్తున్నాడు.. ఫేక్ న్యూస్ పై మంచు విష్ణు రియాక్షన్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న హీరో మంచి విష్ణు తరచు ఏదో ఒక వార్తతో మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నాడు. అతని నటించిన జిన్నా అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లో విష్ణు బిజీగా ఉండగానే అతనిపై కొన్ని తప్పుడు వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా మంచి విష్ణు ఆది పురుష్ పై నెగటివ్ గా స్పందించినట్లు వార్తలు వచ్చాయి. ఇక విషయంపై మంచి విష్ణు మరోసారి ఘాటుగా స్పందించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

జిన్నా ప్రమోషన్స్
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు విష్ణు పలు సినిమాలతో గుర్తింపునందుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో మాత్రం అతనికి బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అయితే అందలేదు. ఇక ఎలాగైనా రాబోయే జిన్నా సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలి అని ఎదురు చూస్తున్నాడు. ఆ సినిమాలో సన్నీలియోన్ పాయల్ రాజ్ హీరోయిన్స్ గా నటించారు. ఇక జిన్నా సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉండగానే మంచి విష్ణు కొన్ని తప్పుడు వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.

కావాలని టార్గెట్
ఇదివరకే మంచు విష్ణు తనపై కావాలని ఒక స్టార్ హీరో టీం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది అని నెగటివ్ కామెంట్స్ తో పాటు తనపై ట్రోల్స్ చేయించేందుకు ఒక టీం కూడా ఏర్పడినట్లుగా మంచి విష్ణు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా విష్ణు మరోసారి సోషల్ మీడియాలో స్పందిస్తూ తనపై ఇంకోసారి టార్గెట్ చేసినట్లుగా వివరణ ఇచ్చాడు.

తప్పుడు వార్తలు
ఇటీవల మంచు విష్ణు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాపై నెగటివ్ గా కామెంట్ చేసినట్లు కొన్ని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో గ్రాఫిక్స్ ఏ మాత్రం బాగోలేదు అని సినిమా తెరపైకి తీసుకురాక ముందే ఆడియన్స్ కు ముందే చెబితే బాగుండేది అని కూడా విష్ణు వివరణ ఇచ్చాడు అని కొన్ని వెబ్ సైట్ లలో వార్తలు వచ్చాయి.

కావాలని ఇలా..
ఇక అందులో ఏమాత్రం నిజం లేదు అంటూ మంచి విష్ణు కొట్టిపారేశారు. తనపై వస్తున్న వార్తలను కూడా ఫేక్ న్యూస్ అని ముందుగా ఊహించినట్లుగానే ఒక ఐటెం రాజా నెగటివ్ న్యూస్ ను స్ప్రెడ్ చేస్తున్నాడు అని కావాలని జిన్నా సినిమాకు ముందే ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అని ట్విట్టర్లో మంచు విష్ణు వివరణ ఇచ్చాడు. అలాగే నా డార్లింగ్ బ్రదర్ ప్రభాస్‌కి బెస్ట్ తప్ప మరేమీ అక్కర్లేదు. అని కూడా విష్ణు తెలియజేశాడు.

ఇది మరో నకిలీ వార్త
అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై కూడా ఒక తప్పుడు వార్త వైరల్ అవుతూ ఉండడంతో విష్ణు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మా అసోసియేషన్ లో సభ్యుడిగా చేరాలి అంటే హీరో హీరోయిన్ ఎవరైనా సరే తప్పనిసరిగా రెండు సినిమాలు చేయాలని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని.. ఇది మరో నకిలీ వార్త! పెయిడ్ బ్యాచ్ తప్పుడు వార్తలను ప్రచారం చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది? అని విష్ణు ట్వీట్ చేశాడు. ఇక జీవితంలో కొంత ఆనందించండి. 21న జిన్నా చూడండి. సానుకూలంగా ఉండండి. సరైన నిజాలను తెలుసుకోవాలని విష్ణు సూచించారు.


Click it and Unblock the Notifications











