సీరియస్ గా ఫ్యామిలీ ఇష్యూస్.. మంచు విష్ణుకు నవ్వులాటైందా?

కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీలో కోల్డ్ వార్ జరిగి.. ప్రస్తుతం ఆ గొడవలు రోడ్డుకెక్కిన సంగతి తెలిసిందే. క్రమశిక్షణకు మారు పేరుపైనా మంచు మోహన్ బాబు ఇంట్లోనే ఇలాంటి అల్లర్లు.. ఆయన అభిమానులను బాధకు గురిచేశాయి. మనోజ్ తిరుగుబాటు, మోహన్ బాబు మనోజ్ పై కేసు పెట్టడం, గతంలో మంచు విష్ణు మనోజ్ మధ్య వార్ వంటి ఘటనలు అభిమానులనే కాదు ఇండస్ట్రీలోని హాట్ టాపిక్ అయ్యాయి. రీసెంట్ మనోజ్ కూడా ఎంబీయూ యూనివర్సటీ ముందు ప్రెస్ మీట్ పెట్టడం ఇలా వివాదం ముదురుతూనే వస్తోంది.

మంచు ఫ్యామిలీ గొడవలకు ఎప్పుడూ ఫుల్ స్టాప్ పడుతుందని, వారందరినీ మళ్లీ ఎప్పుడు ఒక్కటిగా చూస్తామని శ్రేయోభిలాషులు ఎదురుచూస్తున్నారు. కానీ ఏదో చెడు ప్రభావం వల్ల తేపకోసారి మంచు ఫ్యామిలీ వివాదం తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా మంచు విష్ణు ఇచ్చిన సమాధానం మరోసారి వారి కుటుంబ గొడవలను గుర్తు చేసింది. ప్రస్తుతం మంచు విష్ణు కన్నప్ప ప్రమోషన్స్ లో బిజీగా ఉంటున్నారు. మరోవైపు ఆయా ఈవెంట్లు, పలు పనులమీద తిరుగుతూ మీడియా కంట పడుతున్నారు.

Manchu Vishnu Funny reply about pouring Sugar into Manoj s Generator his response went Wrong

ఈ క్రమంలో తాజాగా మంచు విష్ణుకు ఎదురైన ప్రశ్నకు ఆయన ఫన్నీగానే బదులిచ్చారు. కానీ అదికాస్తా రాంగ్ సెన్స్ ను జనాల్లోకి తీసుకెళ్లింది. ఆ మధ్య మనోజ్ కు సంబంధించిన కారు జనరేటర్ లో విష్ణు షుగర్ పోసిన సంగతి తెలిసిందే. అయితే అదే ప్రశ్న తాజాగా మంచు విష్ణుకు ఎదురైంది. దానికి విష్ణు ఇలా స్పందించాడు. 'ఎక్కడో విన్నాను.. జనరేటర్ లో షుగర్ పోస్తే మైలేజ్ బాగా వస్తుందని, అందుకే పోశాను' అని బదులిచ్చారు. ప్రస్తుతం ఆయన సమాధానం హాట్ టాపిక్ గ్గా మారింది.

ఓవైపు కుటుంబ సీరియస్ గా ఇష్య్సూతో సతమతమవుతుంటే.. మంచు విష్ణుకు నవ్వులాటగా ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. అలాంటి ఫన్నీ రిప్లై ఏంటని కొందరు తప్పు పడుతున్నారు. ఇక మరికొందరు మాత్రం రీసెంట్ ఇంటర్వ్యూలో మంచు విష్ణు తన ఫ్యామిలీ త్వరలో కలిసిపోవాలని కోరుకున్నారని, కొన్నాళ్లుగా గొడవలకు దూరంగానే ఉంటున్నారని, ఆయన పనిలో నిమగ్నమయ్యారని చెబుతున్నారు. ఎలాంటి గొడవలకు దారితీయొద్దనే హ్యుమరస్ గా బదులిచ్చాడని కొందరు చెబుతున్నారు. కానీ విష్ణు అలాంటి విషయాల్లో జోక్ లు వేయడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా త్వరగా ఆ కుటుంబ ఒక్కటై మంచి నవ్వులు చిందించాలని కోరుకుంటున్నారు.

Manchu Vishnu Funny reply about pouring Sugar into Manoj s Generator his response went Wrong

ఇక మంచు విష్ణు ఆ మధ్యలో మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ప్రెస్ మీట్ పెట్టిన తనకు జరుగుతున్న అన్యాయాన్ని బయటపెట్టాడు. తన అనుచరులను మోహన్ బాబు వర్గం దాడులు చేసి, భయబ్రాంతులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్ బాబు దానిపై పెద్దగా స్పందించలేదు. ఇక మంచు విష్ణు మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'పైనే ఫోకస్ పెట్టారు. సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసే ఏర్పాట్లు, వీలైనంత ప్రచార కార్యక్రమాలు నిర్వహించే పనిలో నిమగ్నమై ఉన్నారు. 'కన్నప్ప'లో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ వంటి భారీ తారగణం ఉండటంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. రూ.500 కోట్లకు పైగానే వసూళ్లు రాబడుతుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X