బాక్సాఫీస్ వసూళ్ల లెక్కలు చెప్పం.. కన్నప్ప విషయంలో కీలక నిర్ణయం
కన్నప్ప చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఓవర్సీస్ లోనూ ఇంగ్లీష్ వెర్షన్ లో విడుదలైంది. తొలిరోజు ఈ చిత్రానికి భారీ రెస్పాన్స్ దక్కింది. కొంత మేర నెగెటివ్ టాక్ వచ్చినా సినిమా సక్సెస్ ను అడ్డుకోలేకపోయాయి. అయితే ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలు విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వసూళ్లను రోజు వారీగా వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కన్నప్ప విషయంలో మాత్రం మేకర్స్ వెల్లడించలేదు. ఎందుకు ఏంటనే విషయాలను తాజాగా మంచు విష్ణు తెలియజేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
రూ.200 కోట్ల కన్నప్ప..
టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించి రూపొందించిన చిత్రం కన్నప్ప. AVA ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్లపై రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషించగా.. ప్రీతి ముకుందన్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటించింది. మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. ఇక ముఖ్యమైన పాత్రల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మలయాళం స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించారు. హిందీలో మహా భారతం సీరియల్ ను డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఇప్పటి వరకు వసూళ్ల వివరాలు..
కన్నప్ప చిత్రాన్ని ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ భారీగా ప్రమోట్ చేశారు. పైగా చిత్రంలో భారీ తారాగణం ఉండటంతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో ప్రీ సేల్ ద్వారానే రూ. 2 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. ఇక మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.13 కోట్లు వసూళ్లు సాధించిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక 2వ రోజు ఈ చిత్రానికి రూ.8 కోట్లకు పైగా నెట్ వసూళ్లు జరిగింది. ఇలా 2 రోజుల్లో ఈ చిత్రానికి రూ.20 కోట్లకు పైగానే వసూళ్లు అందాయని తెలుస్తోంది.
బాక్సాఫీస్ నెంబర్ పై మంచు విష్ణు క్లారిటీ..
కన్నప్ప చిత్రం బాక్సాఫీస్ నెంబర్లను మాత్రం మేకర్స్ అధికారికంగా ప్రకటించబోమని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకనేదానిపై తాజాగా మంచు విష్ణు స్పందించారు. ఈ సినిమాను కేవలం శివ భక్తిపై తీసినదని, కమర్షియల్ చిత్రంగా రూపొందించలేదని మంచు విష్ణు తెలిపారు. ఇక చిత్రంపై వచ్చిన వసూళ్ల వివరాలను ఇప్పటికి చెప్పలేమని అన్నారు.
మంచు విష్ణు నెక్ట్స్ మూవీ..
టాలీవుడ్ స్టార్ మొత్తానికి కన్నప్ప చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. తన అభిమానులను ఈ సినిమాతో అలరించగలిగాడు. దీంతో మంచు విష్ణు నెక్ట్స్ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే మంచు విష్ణు నెక్ట్స్ కమర్షియల్ ఫిల్మ్ లో నటించబోతున్నానని తాజాగా వెల్లడించారు. ఇక ఆ సినిమా బాక్సాఫీస్ వసూళ్లను తప్పకుండా వెల్లడిస్తానని చెప్పారు.


Click it and Unblock the Notifications











