బూతులు తిట్టడం వల్లనే అలా చేశాను.. దొంగతనంపై క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు హెయిర్ డ్రెసర్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు టాలీవుడ్ హీరో విష్ణు అఫీస్ లో దొంగతనం జరిగిందని సోమవారం ఉదయం నుంచి అనేక రకాల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఫిల్మ్ నగర్ లోని మంచు విష్ణు ఆఫీస్ లో లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి దొంగతనం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇక ఈ ఘటనపై విష్ణు మేనేజర్ సంజయ్ పోలీసులకు హెయిర్ డ్రెసర్ నాగ శ్రీనుపైనే తమకు అనుమానం ఉందని ఫిర్యాదు చేయగా ఇప్పుడు నాగ శ్రీను ఆ వివాదంపై స్పందించారు.

5 లక్షల విలువ చేసే..
మంచు విష్ణు దగ్గర గతకొన్నాళ్ల నుంచి పని చేస్తున్న
వ్యక్తి విష్ణు అఫీస్ లో చోరీ చేసినట్లుగా సోషల్ మీడియాలో కూడా అనేక రకాల కామెంట్స్ అయితే వచ్చాయి. ఫిల్మ్ నగర్ లోని మంచు విష్ణు ఆఫీసులో తెలిసిన వ్యక్తి
దాదాపు రూ. 5లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి చోరీ చేశారని కూడా అన్నారు. అయితే ఫైనల్ గా ఆ ఘటనపై విష్ణు మేనేజర్ సంజయ్ కూడా పోలీసులకు పిర్యాదు కూడా చేశారు. నాగ శ్రీనుపైనే తమకు అనుమానం ఉందని అన్నాడు.

నాగశ్రీను వీడియో రిలీజ్
ఇక నాగ శ్రీను ఒక వీడియోను రిలీజ్ చేస్తూ అన్యాయంగా తనపై నిందలు మోపినట్లుగా ఆవేదన వ్యక్తం చేశాడు. నాగ శ్రీను మాట్లాడుతూ..అందరికి నమస్కారం నా పేరు నాగ శ్రీను. నేను గత పదేళ్లుగా మోహన్ బాబు దగ్గర మంచు విష్ణు దగ్గర పని చేస్తున్నాను. నాకు చెప్పడానికి కూడా మాటలు రావడం లేదు.. అని జరిగిన విషయం ఇది అని చెప్పాడు.

అమ్మానా బూతులు తిట్టారు..
17వా తారీఖు నుంచి నేను వారి దగ్గర పని మానేయడం జరిగింది. ఎందుకంటే నన్ను అమ్మానా బూతులు తిట్టారు. కుల దూషణ కూడా చేశారు. బూతులు మాట్లాడి నా కులాన్ని తిట్టినందుకు నేను పని మానేశాను. ఇక నేను పని మనేసినందుకు నా మీద లేని పోనీ దొంగతనం కేసులు పెడుతున్నారు. అది చాలా అన్యాయం.. అని అన్నాడు.

నన్ను మోకాళ్ళ మీద నిలబెట్టి..
ఈ రోజు నా మీద లేని పోనీ కేసులు పెట్టి నాలాంటి చిన్న తరహా వ్యక్తిని కష్టపెట్టడం మీ లాంటి పెద్ద వారికి భావ్యం కాదు. ఈ రోజు నన్ను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం ఏ మాత్రం న్యాయం కాదు. మీ లాంటి పెద్ద వాళ్ళని నా లాంటి నార్మల్ పర్సన్ తట్టుకోలేరు. నేను కేవలం మీ దగ్గర జాబ్ మానేసింది. మీరు తిట్టి నన్ను మోకాళ్ళ మీద నిలబెట్టి తిట్టినందుకే మానేయడం జరిగింది అని నాగ శ్రీను తెలియజేశాడు

దొంగతనం ఎలా చేస్తాను..
నాకు అంత అవమానం జరిగిన తరువాత పని మానేసి బయటకు వచ్చిన తరువాత నాపై ఎందుకు ఇలా కేసులు పెడుతున్నారు. దొంగతనం నేను ఎందుకు చేస్తాను ఇన్నేళ్ళు దాదాపు 10 సంవత్సరాలు నమ్మకంగా పని చేసిన నేను దొంగతనం ఎలా చేస్తాను. అవన్నీ అవస్తావాలు. ఇక నన్ను మోకాళ్ల మీద నిలబెట్టి అమ్మానా బూతులు తిట్టడం సీసీ టీవీ ఫుటేజ్ లో ఉంది. విష్ణు ఆఫీస్ లో 17వ తారీఖు ఒంటిగంట నుంచి రెండు గంటల మధ్యలో ఇది జరిగింది. దీనిపై ఎవరైనా పెద్దవాళ్ళు స్పందించి నా లాంటి చిన్న జీవితాలు నాశనం అవ్వకుండా చూస్తారని అనుకుంటున్నాను.. అంటూ నాగ శ్రీను వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











