Manchu Vishnu: కన్నప్ప సినిమాతో మరోసారి బయటపడ్డ మంచు విష్ణు హిడెన్ టాలెంట్.. ఏంటో తెలుసా?

మంచు మోహన్ బాబు వారసుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2003లో విష్ణు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన అతడు.. అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించాడు. తండ్రికి తగ్గ కొడుకు అనే మాట అయితే అనిపించుకున్నాడు. ఈ మధ్య పెద్దగా ఆయన సినిమాలు చేయట్లేదు.. చేసిన కొన్ని కూడా ఫ్లాపులుగా నిలుస్తున్నాయి. కానీ గతంలో పరిస్థితి వేరు. ఆయన హీరోగా వచ్చిన చాలా చిత్రాలు హిట్టుగా నిలిచాయి. ముఖ్యంగా సూర్యం, పొలిటికల్ రౌడీ, అస్త్రం, గేమ్, ఢీ, కృష్ణార్జున, సలీం, దేనికైనా రేడీ, దూసుకెళ్తా, రౌడీ, అనుక్షణం వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు.

కానీ ఇటీవలే వచ్చిన జిన్నా చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈక్రమంలోనే ఫుల్ కసితో ఎలాగైనా సరే హిట్టు కొట్టాలని బలంగా ఫిక్స్ అయ్యాడు. అందుకే దివంగత నటుడు కృష్ణంరాజు హీరోగా వచ్చిన భక్త కన్నప్ప చిత్రాన్ని కన్నప్పగా మలిచి మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇందులో మంచు విష్ణుతో చాలా మంది సెలబ్రిటీలు ఈ చిత్రంలో నటించబోతున్నారు. ముఖ్యంగా మోహన్ లాల్, మంచు మోహన్ బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వంటి వాళ్లు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు.

 Manchu Vishnu Hidden Talent Used in Kannappa Movie Check Details Here

ఇదంతా ఇలా ఉండగా... ఈ సినిమా కోసం మంచు విష్ణు చాలానే కష్ట పడుతున్నాడు. ఇటీవలే షూటింగ్ లో ప్రమాదం జరగ్గగా.. త్వరగానే కోలుకొని మళ్లీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. కన్నప్ప సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్న ఈయన... ఈ చిత్రం ద్వారా తనలోని మరో హిడెన్ టాలెంట్ ను ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. ఈ విషయాన్ని పట్టి పట్టి చూస్తే తప్ప గుర్తించలేరు. అదేంటీ హిడెన్ టాలెంట్ అంటున్నారు, గుర్తించలేరు అంటున్నారా అనుకుంటున్నారా.. అవునండి.. ముందు వచ్చే టైటిల్ కార్డ్స్ చూస్తే తప్పు గుర్తించలేరు.

నిర్మాతగా, నటుడిగానే కాకుండా ఈయవ తాజాగా రైటర్ గా కూడా మారారు. ముఖ్యంగా కన్నప్ప సినిమా కోసం మరోసారి పెన్ను చేత పట్టి డైలాగులు, స్క్రిప్టు రాశారు. తనికెళ్ల భరణి రాసిన ఈ సినిమా కథకు మాటలు, స్క్రీన్ ప్లే మంచు విష్ణుయే రాసినట్లు పోస్టర్ లో చూపించారు. అయితే గతంలో వచ్చిన సినిమా అప్పటి వాళ్లకు నచ్చేలా ఉండగా.. ఇప్పటి వాళ్లకు నచ్చేలా స్క్రిప్టులో మాటలు రాసేందుకు మంచు విష్ణు చాలా కష్టపడ్డాడని టాక్ నడుస్తోంది. మరి మంచు విష్ణులోని ఈ కొత్త టాలెంట్ ను ప్రేక్షకులకు ఇప్పటికైనా గుర్తించి ఇష్టపడతారో లేదో చూడాలి.

 Manchu Vishnu Hidden Talent Used in Kannappa Movie Check Details Here

మంచు విష్ణు సినిమాల కోసం పెన్ను పట్టడం ఇదే మొదటి సారి కాదు. గతంలో సంపూర్ణేష్ బాబు హీరోగా వచ్చిన సింగం 123 చిత్రానికి కూడా కథ అందించారు. అయితే ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో మంచి విష్ణు టాలెంట్ ను ఎవరూ గుర్తింలేరు. కన్నప్ప సినిమా గనుక హిట్టు అయితే మాత్రం ఆయనలోని కొత్త టాలెంట్ కు బాగానే మార్కులు పడతాయి. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X