ప్రభాస్ పై మాట మార్చేసిన మంచు విష్ణు.. కన్నప్ప స్ట్రాటజీ ఇదే!

టాలీవుడ్ స్టార్ మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరో 5 రోజుల్లో జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈచిత్రాన్ని ప్రస్తుతం భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ కన్నప్ప చిత్రాన్ని జోరుగా ప్రచారం చేస్తుండటం విశేషం. ఇక తాజాగా హైదరాబాద్ లో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు మంచు మోహన్ బాబు, మంచు విష్ణుతో పాటు బ్రహ్మానందం, శివ డైరెక్టర్ బీవీఎస్ రవితో పాటు చిత్ర తారగణం భారీ స్థాయిలో హాజరైంది. సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇక మంచు విష్ణు తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

భారీ బడ్జెట్ తో కన్నప్ప చిత్ర నిర్మాణం..
మంచు ఫ్యామిలీలో తొలిసారిగా భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో భారీ తారాగణం నటించడం, టాప్ టెక్నీషియన్లు పనిచేయడంతో రూ.200 కోట్లకు పైగా ఖర్చైందని ఇప్పటికే మేకర్స్ తెలిపారు. ప్రమోషన్స్ లోనూ ఎక్కడ తగ్గకుండా, ఖర్చుకు వెనకాడకుండా భారీ ఈవెంట్లు నిర్వహిస్తూ సినిమాను గొప్పగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రేక్షకుల్లో రోజురోజుకు ఆసక్తిని పెంచుతున్నారు.

Manchu Vishnu Interesting Comments on Prabhas

ప్రభాస్ పై మంచు విష్ణు కామెంట్స్..
కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంచు విష్ణు స్పీచ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆ ప్రసంగంలో ఎక్కువ ప్రాధాన్యత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కే ఇవ్వడం మరింత ఆసక్తిని నెలకొల్పింది. ఇక మంచు విష్ణు మాట్లాడుతూ.. స్నేహితుల్లో రెండు రకాలు. కృష్ణుడులాగా, కర్ణుడిలాగా. కృష్ణుడు నీ పక్కనే ఉంట నీకు దారి చూపిస్తా నీ వెంటనే ఉంటానని చెబుతారు. కర్ణుడు ఏదైనా అవ్వని నీ వెనకాలే ఉంట నేను చూసుకుంటానని అంటారు. నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడు. ప్రభాస్ కు ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు. కానీ కేవలం నాన్నగారిపై ఉన్న అభిమానంతో చేశారు. నాకోసం కన్నప్ప చేయలేదని నేను అడిగినప్పుడు కూడా బావ (మోహన్ బాబు) గురించే చేయాలి కదా అంటుంటాడు .

ప్రభాస్ కు ఉన్న స్థాయికి ఈ సినిమా చేయాల్సిన పనిలేదు. కానీ నాకు సపోర్ట్ చేశాడు. ప్రభాస్ వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పిన తక్కువే. కాస్తా పేరు, డబ్బులు రాగానే మారిపోయే ఈరోజుల్లో ప్రభాస్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్టార్ అయినా ఒదిగి ఉంటారు. నాకు ప్రభాస్ మానవత్వం ఎంతగానో నచ్చుతాడు. ఆ విషయాన్ని నేను ఎంతగానో నేర్చుకుంటున్నారు. ప్రభాస్ నువ్వు చూస్తున్నావు. నా జీవితంలో నువ్వు కృష్ణుడివి.. నీ జీవితంలో నేను కర్ణుడిని. నువ్వు లైఫ్ లో ఏది చేసినా నా పూర్తి సపోర్ట్ ఉంటుంది.' అని చెప్పుకొచ్చారు.

గతంలో ప్రభాస్ పై మంచు విష్ణు వ్యాఖ్యలు..
కన్నప్ప చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నారనే సంగతి తెలిసినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు మారిపోయాయి. అందుకు తగ్గట్టుగానే ప్రభాస్ ను కొత్తగా, ఆధ్యాతిక పాత్రలో ప్రేక్షకులను మెప్పించేలా చూపించబోతున్నారు. అయితే కన్నప్ప ప్రమోషన్స్ ప్రారంభంలో మంచు విష్ణు కాస్తా ప్రభాస్ ను తగ్గించి మాట్లాడినట్టు అభిమానులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాస్ బాడీపైనా, ప్రభాస్ రేంజ్ పైన అప్రయత్నంగా కామెంట్స్ చేశారు. కానీ తాజాగా కన్నప్ప ఈవెంట్ లో మాత్రం ప్రభాస్ ను ఆకాశానికి ఎత్తాడు. ప్రభాస్ అసలు రేంజ్ ఏంటో తన మాటాల్లోనే ప్రభాస్ అభిమానులకు వినిపించడం విశేషం. ఇక ఈ చిత్రం ప్రభాస్ తో పాటు అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ క్యామియో అప్పీయరెన్స్ లో నటించడం విశేషం.

More from Filmibeat

Read more about: manchu vishnu kannappa prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X