9000 ఎకరాల్లో ‘కన్నప్ప’ షూటింగ్.. న్యూజిలాండ్ లోనే మొత్తం.. అక్కడే ఎందుకో తెలుసా?
టాలీవుడ్ స్టార్ మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప తో ప్రేక్షకుల ముందు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మంచి మోహన్ బాబు నిర్మాత గా అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో ఇది ఒకటి. ఇక ఈ చిత్రానికి మోహన్ బాబు ఏకంగా 150 కోట్లు బడ్జెట్ ను వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది. భారీ తారాగణంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
వరుసగా ఫ్లాప్స్ అందుకున్న మంచి విష్ణు కాస్త గ్యాప్ తీసుకుని ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ ను యూనిట్ జోరుగా నిర్వహిస్తుంది. కన్నప్ప చిత్రం ప్రచార కార్యక్రమాలను మంచు విష్ణు స్వయంగా చూస్తున్నారు. అన్ని తానై కన్నప్ప మూవీ రీచ్ కు సంబంధించిన విషయాల బాధ్యతలను విష్ణు తన భుజాలపై మోస్తున్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేస్తున్నారు. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఈ ప్రాజెక్టు ప్రారంభించిన మొదటి నుంచి పలువురిలో పలు సందేహాలు మొదలయ్యాయి. అసలు మంచు విష్ణు కన్నప్ప చిత్రాన్ని న్యూజిలాండ్ లోనే ఎందుకు చిత్రీకరిస్తున్నారంటూ ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఇక దీనిపై తాజాగా మంచు విష్ణు స్పందించారు. న్యూజిలాండ్లో కన్నప్ప చిత్రాన్ని పూర్తిగా నిర్మించడానికి ఓ బలమైన కారణం ఉందని చెప్పారు. తను తీయబోయే సినిమా రెండవ శతాబ్దంలో ఉంటుందని తెలిపారు. ఇక ఆ సమయంలో భూ ప్రపంచం ఎలా ఉండేదో, ముఖ్యంగా భారతదేశ భౌగోళికం ఎంత అద్భుతంగా ఉండేదో అలాంటి లోకేషన్లు, వాతావరణాన్ని సినిమా ద్వారా చూపించాల్సి వచ్చింది.
అయితే పొల్యూషన్ లేని వాతావరణం, పర్వతాలు, అప్పటి భారతదేశం భౌగోళిక స్థితిని తెలియజేసే లొకేషన్ లో న్యూజిలాండ్ దేశంలో ఉన్నాయని చెప్పారు. ఇక అందుకే సినిమా పూర్తిగా అక్కడి లొకేషన్ లోనే చిత్రీకరించామని వివరించారు. ఇక తను నమ్మిన విధంగా, దేవుడు మొదట సృష్టించిన ప్రపంచం ఎలా ఉంటుందో అదేవిధంగా న్యూజిలాండ్ ఉండిందని భావించారంట. అందుకే కన్నప్ప చిత్రాన్ని మొత్తం న్యూజిలాండ్ లోనే చిత్రీకరించామని తెలియజేశారు. ప్రేక్షకులకు కూడా అప్పటి అనుభూతిని కలిగించేందుకే న్యూజిలాండ్ షూటింగ్ కోసం ఎంచుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
ఇక కన్నప్ప షూటింగ్ కోసం మంచి విష్ణు న్యూజిలాండ్ లో ఏకంగా 9000 ఎకరాల ఫామ్ హౌస్ ను ఆరు నెలల పాటు లీజుకు కూడా తీసుకున్నారని, షూటింగ్ కి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించామని చెప్పుకొచ్చారు మంచు విష్ణు. ఇక ఈ చిత్రాన్ని 150 కోట్లతో మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో రుద్ర పాత్రలో అలరించబోతున్నారు. ఇక శివుడి పాత్రలో అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్, కిరాతగా మోహన్ లాల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











