MAA Elections : మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం.. 25 శాతం వాటా మాదే!

ప్రస్తుతం మా ప్రెసిడెంట్ గా నరేష్ సెప్టెంబర్ వరకు పదవీకాలం ఉన్నా సరే ఇప్పటికే టాలీవుడ్ కి సంబంధించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.. ఈ ఎన్నికల్లో ఇప్పటికే పోటీ చేస్తున్నట్లు ప్రకాష్ రాజ్ అధికారికంగా ప్రకటించారు.. ఈ క్రమంలో మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ ఉద్దేశిస్తూ రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. సంబంధించిన వివరాల్లోకి వెళితే.

ఉత్కంట రేపుతున్న ఎన్నికలు

ఉత్కంట రేపుతున్న ఎన్నికలు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నరేష్ పదవీకాలం ఇంకా సెప్టెంబర్ వరకు ఉండగా ఎన్నికల హడావుడి మొదలైపోయింది.. ఇప్పటికే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అంటూ ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు.

తాను ఎందుకు పోటీ చేయాల్సి వస్తుందనే అంశాలను కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. తరువాత నటి హేమ కూడా తాను పోటీ చేస్తానని ప్రకటించడమె కాక ఎందుకు పోటీ చేస్తున్నాను అనే అంశం మీద కూడా క్లారిటీ ఇచ్చారు..

లేఖ రాసిన విష్ణు

లేఖ రాసిన విష్ణు

అయితే ముందు నుంచి ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు మంచు విష్ణు మాత్రం దానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ అందరూ ఊహించినట్లుగానే మంచు విష్ణు ఒక లేఖ ద్వారా తాను పోటీలోకి దిగుతున్నా అంటూ ప్రకటించారు. దీనికి సంబంధించిన సుదీర్ఘ లేఖ రాసిన విష్ణు అందులో అనేక అంశాలను స్పృశించారు. ఆయన రాసిన లేఖలోని వివరాలు పరిశీలిద్దాం.

బాధలు బాగా తెలుసు

బాధలు బాగా తెలుసు

మా అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్నానని, మా కుటుంబ సభ్యులైన మీ అందరికీ తెలియజేయడం గౌరవప్రదంగా భావిస్తున్నానని మంచు విష్ణు పేర్కొన్నారు. సినిమా పరిశ్రమనే నమ్మిన కుటుంబంలో పుట్టిన నేను తెలుగు సినిమాతోనే పెరిగానని మన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు ప్రత్యేకంగా చూస్తూ పెరిగిన నాకు మా కుటుంబ సభ్యుల భావాలు, బాధలు బాగా తెలుసని అన్నారు.

నాకు మార్గదర్శకాలు

నాకు మార్గదర్శకాలు

నాకు నా కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్టలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు తాము చాలా రుణపడి ఉంటామని ఆ రుణం తీర్చుకోవడానికి ఈ పరిశ్రమకు సేవ చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను అని అన్నారు. మా నాన్నగారు మా అసోసియేషన్ కు అధ్యక్షుడిగా చేసిన సేవలు వారి అనుభవాలు వారి నాయకత్వ లక్షణాలు నాకు మార్గదర్శకాలు అయ్యాయని విష్ణు చెప్పుకొచ్చారు..

ఖర్చులో పాతిక శాతం

ఖర్చులో పాతిక శాతం

గతంలో మా అసోసియేషన్ కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నేను పని చేసినప్పుడు మా బిల్డింగ్ ఫండ్ కి మా కుటుంబం తరఫున ఆ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులో పాతిక శాతం ఇస్తానని మాట ఇచ్చానని బిల్డింగ్ నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదని అన్నారు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నేను కొన్ని సలహాలు సూచనలు చేశానని అవి మా కుటుంబ సభ్యుల సహకారంతో దిగ్విజయంగా అమలు చేశారని అన్నారు.

మన ఇంటిని మనమే చక్కదిద్దుకొందాం

మన ఇంటిని మనమే చక్కదిద్దుకొందాం

అసోసియేషన్ వ్యవహారాలన్నీ అతి దగ్గరగా జాగ్రత్తగా పరిశీలించి నాకు మా కుటుంబ సభ్యులకు ఏది అవసరమో స్పష్టమైన అవగాహన అనుభవం ఉందని విష్ణు చెప్పుకొచ్చారు. మన ఇంటిని మనమే చక్కదిద్దుకొందామన్న ఆయన సభ్యుల్లో కష్టాల్లో ఉన్న కళాకారులకు ఎప్పుడూ అండగా ఉంటాం, అందుబాటులో ఉంటాం.

మా అసోసియేషన్ కు అధ్యక్షుడిగా నా సేవలను పరిపూర్ణంగా అందించాలి అనుకుంటున్నాను. పెద్దల అనుభవాలు, యువరక్తంతో నిండిన కొత్త ఆలోచనలు కలగలిపి నడవాలని నా ప్రయత్నం మీ అందరి సహకారంతో విజయవంతం కావాలని ఆశిస్తున్నాం అని ఆయన విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X