twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    YS Jagan తో మంచు విష్ణు భేటి.. ఆహ్వానాన్ని తిరస్కరించిన బాలకృష్ణ.. అసలేం జరిగిందంటే?

    |

    కరోనావైరస్ పరిస్థితులు అదుపులోకి వస్తుండటంతో సినిమా పరిశ్రమలో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సినీ వర్గాలు, ఏపీ ప్రభుత్వం చొరవ చూపుతు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, కమెడియన్ ఆలీ తదితరులు భేటి అయ్యారు. అయితే సినిమా పరిశ్రమలో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు, మా అధ్యక్షుడు విష్ణు ఈ భేటిలో కనిపించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమైంది. అయితే తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు భేటి కానున్నారు. అయితే ఈ భేటి వెనుక ప్రధాన ఎజెండా ఏమిటనే విషయం గోప్యంగా ఉంచారు.

    తాజా సమాచారం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం అంటే ఫిబ్రవరి 15వ తేదీన మధ్యాహ్నం ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో విష్ణు భేటి అవుతారు. సీఎంతో భేటి అయ్యేందుకు ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయానికి విష్ణు చేరుకొన్నారు. సీఎంతో భేటి సమయంలో చిత్ర పరిశ్రమ సమస్యలపై మంచు విష్ణు చర్చించే అవకాశం ఉంది.

    Manchu Vishnu meet with AP CM YS Jagan, But Balakrishna rejects

    ఇదిలా ఉండగా, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటికి వెళ్తున్న నేపథ్యంలో నందమూరి బాలకృష్ణను మంచు విష్ణు సంప్రదించినట్టు సమాచారం. అయితే సీఎంను కలిసేందుకు మంచు విష్ణు ఆహ్వానించగా.. అందుకు బాలకృష్ణ సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. సీఎంతో భేటికి రమ్మని ఆహ్వానించారు. కానీ తాను రాలేనని బాలకృష్ణ స్పష్టం చేసినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

    సీఎం వైస్ జగన్‌తో టికెట్ల రేట్లు సమస్య, థియేటర్ యాజమాన్యాలకు సహకారం, అలాగే సినీ పరిశ్రమ వైజాగ్‌కు తరలింపు అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబుతో భేటి సందర్భంగా సినీ పరిశ్రమ తరలి రావాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా సినీ పరిశ్రమ తరలి వస్తే.. స్టూడియోల నిర్మాణాలకు స్థలాలు, సినీ ప్రముఖులకు ఇండ్ల స్థలాలు ఇస్తామంటూ వరాలు కురిపించడం తెలిసిందే.

    English summary
    MAA president Manchu Vishnu is meeting with AP CM YS Jaganmohan Reddy on Tuesday. As per reports, Balakrishna rejected offer from AP Government.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X