Don't Miss!
- News ఏకగ్రీవంగా సికింద్రాబాద్.. మోడీ-అమిత్ షా గేమ్ ప్లాన్?
- Automobiles క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మంచు విష్ణు మోసగాళ్ళు మోషన్ పోస్టర్.. ఈ సారి హిట్టుకొట్టేలా ఉన్నాడు
మంచు విష్ణు బాక్సాఫీస్ హిట్ చూసి చాలా కాలమవుతొంది. కమర్షియల్ సినిమాలు ఎన్ని తీసినా కూడా వర్కౌట్ కావడం లేదు. కొన్నిసార్లు మార్కెట్ పడిపోవడంతో సినిమాలు రిలీజ్ చేయడం కూడా కష్టమైపోయింది. సొంత ప్రొడక్షన్ హౌజ్ లోనే ఎక్కువ సినిమాలు చేసుకుంటూ ఒక ప్లాన్ ప్రకారం వెళుతున్న విష్ణు నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా పవర్ఫుల్ హిట్టుతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు.
హాలీవుడ్ టెక్నీషియన్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మోసగాళ్ళు అనే సినిమా చేస్తున్న విష్ణు కొద్దీ సేపటి క్రితమే ఆ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ని విడుదల చేశాడు. చూస్తుంటే సినిమా హై టెక్నీకల్ వాల్యూస్ తో చాలా తెలివిగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సినిమాను ఇంగ్లీష్ లో కూడా భారీగానే విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక వరల్డ్ బిగ్గెస్ట్ స్కామ్ పాయింట్ ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించారని మోషన్ పోస్టర్ తోనే క్లారిటీ ఇచ్చారు.
ఇక సినిమాలో తారాగణం కూడా గట్టిగానే ఉంది. కాజల్ అగర్వాల్ తో పాటు బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సునీల్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించబోతున్నాడు. నవదీప్ కూడా ఒక స్పెషల్ పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. సొంత ప్రొడక్షన్ సినిమాను నిర్మించిన విష్ణు ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. పైగా గతంలో కంటే ఈ సినిమాకు ఎక్కువగానే ఖర్చు చేసినట్లు సమాచారం. సినిమా దాదాపు పూర్తయినప్పట్టికి కరోనా వైరస్ అదుపులోకి వచ్చిన తరువాతే రెగ్యులర్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలని అనుకుంటున్నారు. మొత్తానికి మోషన్ పోస్టర్ చూస్తుంటే భారీ హైప్ క్రియేట్ అయ్యేలా ఉందని అర్ధమవుతోంది. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.