చివరకు సిస్టమ్ గెలుస్తుంది!.. మంచు విష్ణు ‘మోసగాళ్లు’ ట్రైలర్
మంచు విష్ణు కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం మోసగాళ్లు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రం వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ కథతో రాబోతోంది. యథార్థ ఘటనల ఆధారంగా తీసిన సినిమా అంటూ ముందు నుంచీ హైప్ క్రియేట్ చేస్తూనే వచ్చారు. అలా సినిమాలోని ప్రధాన తారాగణానికి సంబంధించిన ఒక్కో పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ అంచనాలు పెంచేశారు.
ఇప్పుడు మొత్తంగా ట్రైలర్ రిలీజ్ చేస్తూ.. మోసగాళ్లు టీం అసలు విషయం చెప్పేశారు. చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేయించి బాగానే ప్రమోట్ చేసుకున్నారు. అయితే ట్రైలర్‌లోనే సినిమా ఎలా ఉండబోతోందో క్లియర్ కట్‌గా చూపించేశారు. సాఫ్ట్ వేర్ నిపుణుడిగా అర్జున్ పాత్రలో మంచు విష్ణు అదరగొట్టేశాడు. సినిమా మొత్తం 2600 కోట్ల స్కాం నేపథ్యంలో సాగబోతోన్నట్టు కనిపిస్తోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన సునీల్ శెట్టి, మంచు విష్ణుకి మధ్య మంచి సీన్స్ పడ్డట్టే కనిపిస్తోంది.

మొత్తం 2600 కోట్ల స్కాం.. ఆపక పోతే ఇండియన్ ఎకానమీ పడిపోతుందని పోలీస్ ఆఫీసర్ సునీల్ శెట్టి చెప్పడం.. సిస్టమ్‌ను ఓ ఆట ఆడుకునే నాలాంటి వాళ్లే ఇక్కడ కింగ్‌లా బతుకుతున్నారు అని మంచు విష్ణు చెప్పడం.. కానీ చివరగా సిస్టమే గెలుస్తుందని పోలీస్ ఆఫీసర్ అయిన సునీల్ శెట్టి చెప్పిన డైలాగ్ బాగానే పేలింది. మొత్తంగా ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ, మళయాలి, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతోన్నారు.


Click it and Unblock the Notifications











