Manchu Vishnu : రాజమౌళి తో నా సినిమా ఫిక్స్..? ఆ రేంజ్ లోనే ఆలోచిస్తున్న.!

టాలీవుడ్ ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా 20ఏళ్ల కిందనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. 2003 నుంచి మంచు విష్ణు వరుసగా సినిమాలు చేస్తూనే వచ్చారు. ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులతో కలిసి వర్క్ చేశారు. శ్రీనువైట్ల, వైవీఎస్ చౌదరి, శ్రీవాస్, రామ్ గోపాల్ వర్మ, దేవ కట్ట వంటి దర్శకులతో కలిసి పనిచేశారు. అస్త్రం, ఢీ, సలీమ్, దేనికైనా రెడీ, ఎర్రబస్సు, ఈడోరకం ఆడోరకం వంటి గుర్తుండిపోయే సినిమాల్లో నటించారు.

ఇక చివరిగా 'జిన్నా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ చిత్రం పెద్దగా ఆశించిన ఫలితానివ్వలేదు. కరోనా తర్వాత వచ్చిన ఈ చిత్రంతో మంచు విష్ణుకు ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఆ తర్వాత మంచు విష్ణు ఏకంగా మూడేళ్లు గ్యాప్ తీసుకున్నారు. 'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరో బిగ్ ప్రాజెక్ట్ కు ప్లాన్ చేశారు. ఆ చిత్రమే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'గా ప్రస్తుతం రూపుదిద్దుకొంటున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. మంచు విష్ణు కూడా అదే స్థాయిలో 'కన్నప్ప' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Manchu Vishnu Movie with Director SS Rajamouli

30 రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్స్ ను మంచు విష్ణు జోరుగానే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా పలు ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లతో సందడి చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మాటలు కొన్ని వైరల్ గా మారాయి. మంచు విష్ణుకు సంబంధించి త్రో బ్యాక్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ కింద ఉన్న వీడియో ప్రకారం.. మంచు విష్ణు ఎస్ఎస్ రాజమౌళితో సినిమాపై ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రం తరువాత రాజమౌళికి హాలీవుడ్ దర్శకుల నుంచి ప్రశంసలు అందిన సంగతి తెలిసిందే.

అదే మంచు విష్ణు తన చివరి సినిమా ప్రమోషన్స్ లో అదే విషయాన్ని గుర్తు చేశారు. రాజమౌళితో తను సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన విష్ లిస్ట్ లో, తన మనస్సులో ఎప్పటి నుంచో ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేయాలని ఉందన్నట్టు తన కోరికను చెప్పుకొచ్చారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి టాలీవుడ్ కు గౌరవం తీసుకొచ్చారని తెలిపారు. ఇక తను ఎప్పుడూ ప్రైవేట్ గానే ఉంటానని సినిమా ఫంక్షన్ల కోసమే వస్తుంటానని కూడా తెలిపారు. అయితే ప్రస్తుతం రూ.150 కోట్లతో మంచు విష్ణు భారీ చిత్రం 'కన్నప్ప'ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో రాజమౌళితో చేస్తానన్న సినిమాపైనా ఫోకస్ చేయాలని అభిమానులు కోరుతున్నారు.

Take a Poll

మరోవైపు ఎస్ఎస్ రాజమౌళి ఎస్ఎస్ఎంబీ29 ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఒడిశాలో షూటింగ్ కొనసాగుతోంది. ఇక ఇటు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'ను పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గా తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ లోనూ విడుదల కాబోతోంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ గెస్ట్ రోల్ లో అలరించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X