Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్‌కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
ఇంకా ఎన్ని రోజులో చూస్తా.. అందరూ నీ అంత లక్కీ కాదు కదా.. హీరోల ట్వీట్స్ వైరల్
టాలీవుడ్లో పెళ్లి కాను ప్రసాద్‌లు చాలా మందే ఉన్నారు. ఆ లిస్ట్ గురించి చెప్పుకుంటూ పోతూ గంటల కొద్ది సమయం ఇట్టే కరిగిపోతుంది. ఎందుకుంటే ఆ జాబితా అంత పెద్దది మరి. తాజాగా తన మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సోలో బతుకే సో బెటర్ అంటూ ఓ పోస్ట్ చేశాడు. దీనికి మంచు విష్ణు వేసిన కౌంటర్.. వాటికి సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన రిప్లై వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం..
సోలో బతుకే సో బెటర్..
చిత్రలహరి సినిమాతో ఎలాంటి చిత్రాలు చేయాలి.. ఎలాంటి కథలకు ఓకే చెప్పాలనే విషయం బోధపడింది మెగా హీరోకు. అందుకే వెను వెంటనే మారుతి చెప్పిన ప్రతిరోజూ పండగే చిత్రాన్ని లైన్లో పెట్టాడు. భారీ హిట్టు కొట్టాడు. ప్రస్తుతం సోలో బతుకే సో బెటర్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రెడీ అవుతున్నాడు.
|
మూవీ ప్రమోషన్స్ చేస్తోన్న మెగా హీరో..
సోలో బతుకే.. మూవీ మొదలు పెట్టినప్పటి నుంచీ ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. ఆ మధ్య షూటింగ్ షెడ్యూల్ పూర్తయిన ఫోటోను షేర్ చేయగా.. అందరూ సింగిలేనని, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారంటూ ట్వీట్ చేశాడు. ఆ మధ్య విశాఖ సముద్ర తీరంలో ఒంటరిగా నడుచుకుంటూ సోలో బతుకే సో బెటర్ అంటూ ట్వీట్ చేశాడు.
తాజాగా మరో ట్వీట్..
సోలో బతుకే సో బెటర్ అనే దానికి ఉదాహరణలు చెబుతూ.. ఓ పోస్ట్ చేశాడు. ఎవ్వరి కోసం పరిగెత్తనక్కర్లేదు. సెల్ ఫోన్ చార్జ్ అయిపోతే బాధపడనక్కర్లేదు.. ఆటలు ఆడుకుంటూ ఉంటే మధ్యలో వదిలేసి వెళ్లనక్కర్లేదు.. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో ఇష్టమున్నట్టు గడపొచ్చు అంటూ ఓ లిస్ట్ పోస్ట్ చేశాడు.
|
మంచు విష్ణు స్పందన..
సుప్రీమ్ హీరో చేసిన ఈ పోస్ట్‌కు మంచు విష్ణు స్పందిస్తూ.. తమ్ముడు, నా చిన్ని సోదరుడా.. ఈ ట్వీట్ నేను సేవ్ చేసుకున్నా.. ఇంకా ఎన్ని రోజులు సోలో చూస్తాగా.. ఆల్ ది బెస్ట్ ఫర్ సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ట్వీట్ చేశాడు.
|
మెగా హీరో రిప్లై..
మంచు విష్ణు కామెంట్స్‌కు సాయి ధరమ్ తేజ్ రిప్లై ఇస్తూ.. హహహ.. విష్ణు అన్నా అందరూ నీలా అదృష్టవంతులు కాదు కదా అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.