మీడియాను బకారా చేసిన మంచు విష్ణు.. గొడవతో ఏకంగా రియాలిటీ షో?
మంచు ఫ్యామిలీ ఎలాంటి కామెంట చేసినా అలాగే ఎలాంటి ఫొటోలు రిలీజ్ చేసినా కూడా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. అయితే తమను కావాలని కొందరు ట్రోల్ చేస్తున్నారు అని ఒక సినీ పెద్ద టార్గెట్ చేసినట్లు కూడా విష్ణు వివరణ ఇచ్చారు. ఇక ఇటీవల మంచు విష్ణు మరొక వీడియోను పోస్ట్ చేసిన విధానం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ వీడియోతో హై లెవెల్లో హడావుడి చేసిన మీడియాను బకారా చేసినట్లు అర్ధమవుతోంది. విష్ణు పోస్ట్ చేసిన వీడియో వివరాల్లోకి వెళితే..

మనోజ్ పోస్ట్ చేసిన వీడియో
రచ్చకెక్కిన మంచు వారి కుటుంబ గొడవలు అంటూ కొద్ది రోజుల క్రితం మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు ప్రసారమైన సంగతి అందరికి గుర్తుండే ఉంటుంది. మంచు మనోజ్ దగ్గర పని చేస్తున్న సారధి అనే వ్యక్తి ఇంటికి వెళ్లిన మంచు విష్ణు అక్కడ ఏదో గలాటా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు... మంచు మనోజ్ దాన్ని వీడియో తీసి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అది పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది.

అప్పుడే ప్రాంక్ అని డౌట్స్
మీడియా అయితే నాలుగు అడుగులు ముందుకు వేసి వారిద్దరి మధ్య ఏదేదో జరిగిపోతోంది. అందుకే మంచు మనోజ్ వివాహం సమయంలో కూడా మంచు విష్ణు చాలా తక్కువ సమయం వెచ్చించారు అంటూ ఇలా రకరకాల కథనాలు వడ్డించింది. అయితే అప్పట్లోనే ఇది ఏదైనా ప్రాంక్ అయి ఉంటుందేమో అని కొందరు నెటిజెన్లు అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు.

హౌస్ ఆఫ్ మంచుస్.. రియాలిటీ షో
ఇక చివరికి ఇది ప్రాంక్ అని చెబుతూ మీడియా మొత్తాన్ని ఒక్కసారిగా బకరా చేసేసింది మంచు కుటుంబం. హౌస్ ఆఫ్ మంచుస్ పేరుతో ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ రియాలిటీ షో చేస్తున్నామంటూ మంచు విష్టు తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆ వీడియో మరింత వైరల్ గా మారింది.

టీజర్ లో ఎలివేషన్స్
టీజర్ గా చెప్పబడుతున్న అందులో మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య జరిగిన గొడవ ఆ తర్వాత ఈ గొడవ గురించి మీడియా కవరింగ్ క్లిప్పింగ్స్ కూడా షేర్ చేశారు. ఆ తర్వాత తాను మోహన్ బాబు కుమారుడిని చెబుతూ మోహన్ బాబు మంచు విష్ణు ఉన్న క్లిప్పింగ్స్ కూడా దానికి జత చేశారు. అలాగే అందులో మంచు వారి యూనివర్సిటీకి సంబంధించిన ఎలివేషన్స్ కూడా ఉన్నాయని అర్ధమవుతోంది. ఇక ఇది త్వరలోనే స్ట్రీమింగ్ కానుందట.
బకారా చేశారుగా..
అయితే మంచు మనోజ్ ఫుటేజ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. మంచు విష్ణు ఇలా షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు మంచు కుటుంబం మొత్తం కలిసి మీడియా మొత్తాన్ని బకరా చేసేసిందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరో వర్గం వారు అయితే నిజంగానే గొడవ జరిగి ఉంటుంది. దాని కవర్ చేసేందుకు ఆ రియాలిటీ షో అనే పేరుతో కవరింగ్ ఇస్తున్నారు అని అంటున్నారు. చూడాలి ఇక ఇందులో ఎంత నిజం ఉందో.


Click it and Unblock the Notifications











