100 కోట్ల రెమ్యునరేషన్ ఎందుకు? మంచు విష్ణు ఆవేదన

టాలీవుడ్ ప్రముఖ హీరో మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప తో ఫుల్ బిజీగా ఉన్నారు. వచ్చేనెల ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ఉండడంతో ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు ప్రెస్ మీట్ లు, పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. సినిమాకు సంబంధించిన కీలకమైన విషయాలను కూడా ఆడియన్స్ దృష్టికి చేరేలా చేరవేస్తూ హైపును పెంచేస్తున్నారు. మొదటిసారిగా మంచు విష్ణు పాన్ ఇండియా సినిమాతో థియేటర్లలోకి రాబోతుండడం కూడా మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న కన్నప్ప చిత్రాన్ని ఇప్పటికే న్యూజిలాండ్ లో షూటింగ్ కు సంబంధించిన పనులను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీమ్ నిమగ్నమై ఉంది. కాగా మంచు విష్ణు ఒక్కడే ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా తన సినిమా విషయాలను తెలియజేయడంతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని విషయాల పైన స్పందిస్తున్నారు. కాగా, కొన్నాళ్ళుగా టాలీవుడ్ లో స్టార్స్ అత్యధిక రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారనే వార్త హాట్ టాపిక్ గా కొనసాగుతున్న విషయం తెలిసింది. ఇక దీనిపై తాజాగా మంచు విష్ణు స్పందించారు.

Manchu Vishnu Responded on 100 Crore Remuneration for Tollywood Stars

ప్రస్తుతం టాలీవుడ్ లో కేవలం ముగ్గురు హీరోలు మాత్రమే 100 కోట్ల వరకు పారితోషకాలు అందుకుంటున్నారని చెప్పారు. అయితే అందులో టాలీవుడ్ లో ఉన్న స్టార్స్ అందరూ 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని సూచించారు. 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారు కూడా వారి అర్హతకు లోబడే తీసుకుంటున్నారని క్లారిటీ ఇచ్చారు. వారు పడే కష్టానికి, వారికి ఉన్న క్రేజ్ కు, మార్కెట్లో వాళ్ల సినిమాలకు ఉన్న డిమాండ్ ను బట్టి ఆ స్థాయిలో పారితోషికాలు ఇస్తున్నారని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

అంతేకానీ అందరూ అనుకున్నట్టుగా ఊరికనే వారికే 100 కోట్ల రెమినరేషన్ ఇవ్వడం లేదని చెప్పారు. టాలీవుడ్ స్టార్స్ అత్యధికంగా రెమ్యూనరేషన్లు పుచ్చుకుంటున్నారు అంటూ వస్తున్న కామెంట్లకు ఇలా చెక్ పెట్టారు. మంచు విష్ణు భారీ రెమ్యూనరేషన్ లను సమర్థించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ లో మాత్రం ప్రస్తుతం ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ల పేర్లు మాత్రమే 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారంటూ ప్రచారంలో వినిపిస్తున్నాయి. ఇక మంచు విష్ణు కూడా ఆ ముగ్గురు అంటూ వీరిని కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ చిత్రాలు రూపుదిద్దుకుంటుండటం అందరూ గర్వించదగ్గ విషయమే. దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు సినిమాలకు ఇప్పుడు డిమాండ్ పెరగడం మంచి పరిణామం. ఈ క్రమంలో మన స్టార్స్ కూడా ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవడం సబబేనని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇక మరికొందరు మాత్రం ఆ స్థాయి లేని వాళ్ళు కూడా అలాంటి రేమ్యూనరేషన్ల కోసం పాకులాడడం సరికాదని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే మంచు విష్ణు కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న ఇండియాలోని ప్రధాన ప్రాంతీయ భాషలతో పాటు ఇంగ్లీష్ లోను వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ కీలకపాత్రను పోషిస్తున్నారు.

More from Filmibeat

Read more about: manchu vishnu remuneration
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X