Don't Miss!
- News
girlfriend: సీక్రేట్ గా పెళ్లి, కొండ మీద రొమాన్స్, పోలీసు అధికారి కొడుకు ఏం చేశాడంటే, ఇంట్లోనే కిల్లర్!
- Sports
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
మంచు మనోజ్ తో వివాదం.. అందుకే వేర్వేరు ఇళ్ళలో.. అసలు విషయం చెప్పేసిన విష్ణు!
అలీతో సరదాగా ప్రోగ్రాం ఎంత సూపర్ హిట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతివారం ఎవరో ఒక అతిథిని తీసుకొచ్చి వాళ్ళ జీవితంలో ఎవరు అడగని ప్రశ్నలు అడుగుతూ అనేక విషయాలను ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజా ఇంటర్వ్యూలో మంచు విష్ణు హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో మంచు విష్ణు అనేక విషయాలను పంచుకున్నారు. అలాగే మంచు మనోజ్ తో తనకు ఉన్న విభేదాల గురించి కూడా మొట్టమొదటిసారిగా మంచు విష్ణు ఓపెన్ అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళితే
Huma Qureshi: నటనలోనే కాదు, గ్లామర్ లో కూడా తగ్గేదేలే.. అంటున్న హాట్ బ్యూటీ

సీరియస్ క్వశ్చన్
నేను ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతా అని పేర్కొన్న అలీ, అది నువ్వే రివీల్ చేయాలని అది కరెక్టా కాదా ? నీ సమాధానం ఏంటి అనేది నువ్వే చెప్పాలి అని అన్నారు. తాను ఒక చోట చదివాను అని, నీకు నీ తమ్ముడు మనోజ్ కి పడడం లేదని మీ ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారని, నువ్వైతే మరీ ముఖ్యంగా మనోజ్ మీద కోపంగా ఉంటున్నావ్ అని ఇలా కొన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి అని అలీ అన్నారు.

సీరియస్ అయిన విష్ణు
అయితే ఇలా పుకార్లు పుట్టించిన వారికి నువ్వు చెప్పే సమాధానం ఏమిటి అని అని ప్రశ్నించారు. దీనికి సీరియస్ అయిన విష్ణు అసలు వాళ్ళకి సమాధానం ఎందుకు చెప్పాలి అని ప్రశ్నించారు. సమాధానం ఎందుకు చెప్పాలి అని ప్రశ్నిస్తూ లేచి పైన వేసుకున్న కోట్ తీసి సీరియస్ అవుతున్నట్లు చూపించారు. ఇదేంటి కోట్ చేస్తున్నావ్ కొడతావా అని అడిగితే మళ్లీ కూల్ అయిపోయి నవ్వుతూ కోటు వేసుకుంటే కాస్త వేడిగా ఉందని పేర్కొన్నారు.

సమాధానం చెప్పడం అనవసరం
ఇక ఆ కోట్ తీస్తూనే ఏంటి క్వశ్చన్ ఏంటి అడుగుతున్నావ్ ఏంటి అని బెదిరిస్తున్న ధోరణిలో ప్రశ్నించడంతో అలీ కూడా సరదాగా లేచి నుంచుని సన్నివేశాన్ని నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక వాళ్లకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్న మంచు విష్ణు ఇలాంటి పుకార్లు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయి అని అన్నారు. ఈ పుకార్లు అన్నిటికీ పుకార్లు పుట్టించిన వాళ్లందరికీ సమాధానం చెప్పడం అనవసరం అని అన్నారు.

అంతమాత్రాన మాట్లాడటం లేదు అంటే ఎలా
ఇక మేము పుట్టిపెరిగింది చాలా సంప్రదాయ పద్ధతిలో అని, అక్క ఒక ఇంట్లో ఉంటుందని మనోజ్ వేరే ఇంట్లో ఉంటాడని నేను నాన్నగారితో ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి నాకు ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం అని కానీ అక్కకు తమ్ముడికి వాళ్ళు ప్రైవసీగా ఉండడం ఇష్టం అని చెప్పుకొచ్చారు. అంతమాత్రాన మాట్లాడటం లేదు, అది ఇది అంటే అది కరెక్ట్ కాదని అన్నారు.
Recommended Video

వ్యూయర్స్ రావడం కోసం
ఇక అయితే మీ మధ్య వివాదం ఏమీ లేదా అని అలీ ప్రశ్నించగా అస్సలు ఏమీ లేదని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా ఊహించే ఉంటారు అని మళ్ళీ అడిగితే మనలాంటి సెలబ్రిటీల గురించి వార్తలు రాసుకోవడం వాళ్ళ పని అని వ్యూయర్స్ రావడం కోసం ఏది పడితే అది రాస్తారు అని చెప్పుకొచ్చారు. ఇక నేను ప్రశ్నలు అడుగుతుంటే నువ్వు ఒకటి విప్పేస్తూ ఉన్నావు ఏంటి అని ప్రశ్నించగా అది ఏమీ లేదు ఇదే లాస్ట్ అని సరదాగా చెప్పుకొచ్చాడు విష్ణు.