ఇండియాస్ బెస్ట్ వెబ్ సిరీస్.. మంచు విష్ణు డెబ్యూకి ఇండియా లెవల్లో గుర్తింపు
నటుడు మోహన్ బాబు కుమారుడుగా సినీ ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు ఆ తరువాత కాలంలో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆయన నిర్మాతగా మారి ఒక వెబ్ సిరీస్ అలాగే కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. ఇప్పటికే ఆయన నిర్మించిన వెబ్ సిరీస్ జి5 యాప్ ద్వారా రిలీజ్ కాగా మోసగాళ్లు సినిమా కూడా ఈ ఏడాది మొదట్లో రిలీజ్ అయింది. మోసగాళ్లు సినిమా అనుకున్న మేర కలెక్షన్లు సాధించలేకపోయింది.
కానీ ఆయన నిర్మాతగా చేసిన మొదటి వెబ్ సిరీస్ మాత్రం ఇప్పుడు ఇండియా లెవెల్ లో ఒక ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఈ వెబ్ సిరీస్ తాజాగా రీజినల్ క్యాటగిరీలో ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డును గెలుచుకుంది. ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించారు. శ్రీకాంత్ ప్రధాన పాత్రలలో నటించిన చదరంగం అనే వెబ్ సిరీస్ ను రాజ్ అనంత అనే దర్శకుడు తెరకెక్కించారు. శ్రీకాంత్, సునైనా, నాగినీడు లాంటి నటులు కీలక పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 2020 లోని స్ట్రీమ్ అయింది.

ఇక ఆన్-డిమాండ్ వీడియో, ఆడియో కంటెంట్‌లో మేటి కంటెంట్ ను గౌరవించటానికి ఎక్స్ఛేంజ్ 4 మీడియా (ఇ4ఎమ్) గ్రూప్ స్ట్రీమింగ్ మీడియా అవార్డ్స్ 2021తో ముందుకు వచ్చింది. "ఈ అవార్డు లభించడం గౌరవంగా ఉంది. వెబ్ సిరీస్ మన హృదయానికి చాలా దగ్గరగా ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులతో ముందుకు రావడానికి ఇది మమ్మల్ని ప్రేరేపిస్తుంది " అంటూ విష్ణు మంచు ఈ అవార్డు గురించి ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. "ఈ గుర్తింపు లభించినందుకు మీకు ధన్యవాదాలు అని చెబుతూ శ్రీకాంత్, దర్శకుడు రాజ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత విజయ్ లను ఆయన అభినందించారు.


Click it and Unblock the Notifications











