ఫ్యాన్సీ రేటుకు ఓటర్.. సార్థక్ మూవీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా

రామా రీల్స్‌ బ్యానర్‌పై జాన్‌ సుధీర్‌ పూదోట నిర్మాతగా విష్ణు మంచు, సురభి జంటగా జి.ఎస్‌.కార్తీక్‌ దర్శకత్వం వహించిన 'ఓటర్‌' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అనేక అడ్డంకులు ఎదుర్కొన్న ఈ చిత్రం మీద ఆడియన్స్‌లోనూ, ట్రేడ్‌ వర్గాల్లోనూ మంచి క్రేజ్‌ ఏర్పడింది. అందుకే సార్థక్‌ మూవీస్‌ సంస్థ పోటీపడి మరీ ఫ్యాన్సీ రేటుకి విడుదల హక్కులను సొంతం చేసుకుంది. ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, కెమెరా: రాజేష్‌ యాదవ్‌, ఎడిటింగ్‌: కె.ఎల్‌ ప్రవీణ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : కిరణ్‌ తనమాల.

వివాదాలను, అవరోధాలను అధిగమించి ఓటర్ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రాన్ని జాన్ సుధీర్ పూదోట నిర్మించగా, ఎన్నో చిత్రాలను నిర్మించి, పంపిణి చేసిన ప్రశాంత్ గౌడ్ సార్థక్ మూవీస్ ద్వారా ఓటర్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ సందర్బంగా ప్రశాంత్ గౌడ్ మాట్లాడారు.

Manchu Vishnus Voter movie set to release on June 21st

ప్రస్తుత ఏడాదిలో మా సార్థక్ మూవీస్ ద్వారా అనేక విజయవంతమైన సినిమాలను విడుదల చేశాం. ఈ ఓటర్ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా అవుట్‌పుట్ బాగా ఉండటంతో కొనుగోలు చేసేందుకు విపరీతంగా పోటీ పడ్డారు. ఆ పోటీలో ఫ్యాన్సీ రేటుకు ఓటర్ సినిమా హక్కులను దక్కించుకోవడం ఆనందంగా ఉంది. ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకొంటుందని బలంగా నమ్ముతున్నాను. భారీ విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను అని ప్రశాంత్ గౌడ్ అన్నారు.

నిర్మాత జాన్ సుధీర్ మాట్లాడుతూ.. మా ఓటర్ చిత్రాన్ని ప్రశాంత్ గౌడ్ తన సొంత నిర్మాణ సంస్థ సార్ధక్ మూవీస్ ద్వారా విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. విజయం పట్ల ధీమాగా ఉన్నాను అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X