twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Manchu Vishnu : ఓటుకు రూ.75 వేలు ఇచ్చా.. మహేష్ బాబుకు ‘గూగుల్‌ పే’.. మామూలుగా లేదుగా!

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న దాఖలాలు ఎక్కువైపోయాయి. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ప్యానల్ అలాగే మంచు విష్ణు ప్యానల్ ఎన్నికల బరిలో తలపడుతున్నాయి. మంచు విష్ణు అలాగే ప్రకాష్ రాజ్ ఇద్దరు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. అయితే ముందు నుంచి అన్ని విషయాల్లో చాలా సీరియస్ కామెంట్స్ చేస్తూ వచ్చిన విష్ణు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా మాత్రం చాలా కూల్ గా కనబడడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

     వారికి అవకాశం

    వారికి అవకాశం

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరో మూడు రోజుల్లో జరగబోతున్నాయి. ఆదివారం నాడు ఉదయం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఈ మేరకు తెలుగు నిర్మాతలు కూడా నటీనటులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల అధికారి సూచనల మేరకు ఉదయం ఓటింగ్ కు హాజరై మధ్యాహ్నం 2 గంటల నుంచి షూటింగ్కు హాజరయ్యేలా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉన్న అందరు సభ్యులకు అవకాశం కల్పించారు.

    మేనిఫెస్టో విడుదల

    మేనిఫెస్టో విడుదల

    ఇక ఈ రోజు మంచు విష్ణు తన ప్యానల్ కి సంబంధించిన మేనిఫెస్టో విడుదల చేశారు. దాదాపు 15 అంశాలు మంచు విష్ణు ప్రస్తావిస్తూ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇవి చేసి తీరుతామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

     లోకల్ - నాన్ లోకల్ అనేది సమస్య కాదు

    లోకల్ - నాన్ లోకల్ అనేది సమస్య కాదు

    ఇక ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ మా ఎన్నికల్లో లోకల్ - నాన్ లోకల్ అనేది సమస్య కాదని అందరూ నటులకు అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని విష్ణు చెప్పుకొచ్చారు. ఏ భాషలో అయినా ఎక్కడికి వెళ్లి అయినా స్వేచ్ఛగా నటించవచ్చు అని పేర్కొన్న మంచు విష్ణు నటుల ఎంపిక అనేది దర్శకులను ఆధారంగా చేసుకొని ఉంటుందని చెప్పుకొచ్చారు.

    ఓటుకు 10000

    ఓటుకు 10000

    దర్శకుల ఎంపికలను తాను తప్పు పట్టడం లేదు కానీ ముందు స్థానిక నటులను గుర్తించి వారికి కూడా అవకాశం ఇచ్చే లాగా చూడాలని కోరారు.. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిబంధనలో ఉన్న కొన్ని లొసుగులను అవకాశంగా తీసుకుని ఈ అసోసియేషన్ లో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అందుకే తాము అధికారంలోకి రాగానే రూల్స్ మారుస్తామని అన్నారు. ఇక మీడియాతో మాట్లాడుతున్న సమయంలో మీరు ఓటుకు 10000 ఇస్తున్నారనే నాగబాబు ఆరోపించారు అని పేర్కొనగా కాదు పది వేలు కాదు 75 వేలు ఇస్తానని అన్నారు.

     912 మందికి 75 వేల చొప్పున

    912 మందికి 75 వేల చొప్పున

    అసోసియేషన్ లో ఉన్న 912 మందికి 75 వేల చొప్పున ఇచ్చాను, మా నాన్న, అక్క తమ్ముడికి కూడా 75 వేలు ఇచ్చాను అని అలా ఇచ్చాక ఓటు వేయమని అడిగానని కౌంటర్ వేశారు. అంతేకాక మహేష్ బాబుకు కూడా 75000 గూగుల్ పే చేశానని ఆయన ఊర్లో మాత్రం లేడని చెప్పుకొచ్చారు. ఇక అధ్యక్షుడు అయ్యాక ఓటు వేయని వారందరి నుంచి మళ్ళీ ఆ డబ్బు తీసుకుంటామని మంచు విష్ణు కౌంటర్ వేయడం ఆసక్తికరంగా మారింది.

    English summary
    manchu vishnu says he offered 75000 per vote in MAA elections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X