Manchu Vishnu: కన్నప్ప షూటింగ్ లో ప్రమాదం.. మంచు విష్ణుకు తీవ్ర గాయాలు?

నట ప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2003లో విష్ణు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన అతడు అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. అందం, అభియనంతో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా సూర్యం, పొలిటికల్ రౌడీ, అస్త్రం, గేమ్, ఢీ, కృష్ణార్జున, సలీం, వస్తాడు నా రాజు, దేనికైనా రేడీ, దూసుకెళ్తా, పాండవులు పాండవులు తుమ్మెద, రౌడీ, అనుక్షణం, ఎర్రబస్సు, డైనమైట్, ఈడోరకం ఆడోరకం వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు.

కానీ చాలా కాలంగా ఆయన తీసిన సినిమాలు అన్నీ ఫ్లాపులుగా మిగిలిపోతున్నాయి. ముఖ్యంగా లక్కున్నోడు, గాయత్రి, ఆచారి అమెరికా యాత్ర, ఓటర్, మోసగాళ్లు, జిన్నా వంటి చిత్రాలన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి. ఈక్రమంలోనే ఒక్క మంచి సినిమాతోనైనా సరే వచ్చి సూపర్ డూపర్ హిట్టు కొట్టాలనే కసితో ఉన్నాడు. కన్నప్ప అనే సినిమాతో మన ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దివంగత నటుడు కృష్ణంరాజు హీరోగా వచ్చిన భక్త కన్నప్ప చిత్రాన్ని కన్నప్పగా తీసుకు రాబోతున్నారు.

Manchu Vishnu Seriously Injured in Kannappa Movie Shotting Accident

ఈ సినిమాలో నటించేందుకు పెద్ద పెద్ద స్టార్ హీరోలను కూడా రంగంలోకి దింపుతున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అనుష్క, మోహన్ లాల్, శివన్న లాంటి స్టార్ యాక్టర్లు కూడా ఈ సినిమాలో కనిపించున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతోంది. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అనేక సన్నివేషాలను తెరకెక్కించారు. ఇక ఈ క్రమంలోనే కన్నప్ప సినిమా షూటింగ్ సెట్ లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.ఈ ప్రమాదంలో మంచు విష్ణుకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి.

Manchu Vishnu Seriously Injured in Kannappa Movie Shotting Accident

షూటింగ్ సమయంలో డ్రోన్ కెమెరా అదుపు తప్పి హీరో మంచు విష్ణు మీదకు దూసుకు రావడంతో చేతికి గాయాలు అయ్యాయని సమాచారం. అలాగే శరీరంలోని మరికొన్ని చోట్ల కూడా గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినట్లు గుర్తించిన చిత్రబృందం వెంటనే ఆయనను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారట. అయితే గాయాలు కావడంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారట. ఈ ప్రమాదంతో దర్శక, నిర్మాతలు షూటింగ్ ను ఆపేసినట్లు సమాచారం.

Manchu Vishnu Seriously Injured in Kannappa Movie Shotting Accident

మంచు విష్ణుకు ప్రమాదం జరిగి ఆయన గాయపడినట్లు తెలుసుకున్న మంచు అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రమాదంలో గాయపడిన మంచు విష్ణుకు పెద్దగా ఏమీ కాలేదని, త్వరలోనే ఆయన కోలుకుంటారని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఆయన త్వరగా కోలుకొని మళ్లీ షూటింగ్ లో పాల్గొనాలని కోరుకుంటున్నారు. మరి కన్నప్ప సినిమాతో అయినా మంచు విష్ణు కెరియర్ మలుపు తిరుగుతుందా లేదా తెలియాలంటే ఇంకా కంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X