డబ్బింగ్ సినిమాలో నటించి ‘మా’ సభ్యుడయ్యాడు.. గోడవలన్నీ అతని వల్లే..: మంచు విష్ణు

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికలు ఇటీవల రసవత్తరంగా కొనసాగిన విషయం తెలిసిందే. మొత్తానికి ప్రకాశ్ రాజ్ తో పోటీ పడే మంచు విష్ణు మా అధ్యక్ష పీఠాన్ని అందుకున్నాడు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం కూడా వివాదాలు ఇంకా అదే తరహాలో కొనసాగుతున్నాయి. ఈ గొడవలకు ఏదో ఒక విధంగా ముగింపు పలకాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు.

కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా వివధాలు తగ్గడం లేదు. ఎప్పుడు ఏదో ఒక వివాదంతో మా సభ్యులు మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉన్నారు. మంచు విష్ణు మరోసారి వివాదం పై ఇచ్చే ప్రయత్నం చేశారు. మా లో గొడవలు రావడానికి ఒక ప్రధాన వ్యక్తి కారణం అని పరోక్షంగా మంచు విష్ణు కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

 ఏ మాత్రం సంతోషం లేదని..

ఏ మాత్రం సంతోషం లేదని..

ముందుగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు సంబంధించిన కొంత మంది కమిటీ సభ్యులు సభ్యులు రాజీనామా చేస్తున్నామని అధికారికంగా ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచిన కూడా తమకు ఏ మాత్రం సంతోషం లేదని ఆరోపణలు చేస్తూ తప్పకుండా రాజీనామా చేస్తామని వివరణ ఇచ్చారు. అయితే ప్రకాష్ రాజ్ కు సంబంధించిన రాజీనామాలు ఇంతవరకు ఎవరికీ కూడా తన వద్దకు రాలేదని మంచు విష్ణు వివరణ ఇచ్చాడు.

పవన్ కళ్యాణ్ తో మాట్లాడాను

పవన్ కళ్యాణ్ తో మాట్లాడాను

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇటీవల పార్టీలకు అతీతంగా నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. అలాగే ఆ వేడుకలో పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సమయంలోనే తాను పవన్ కళ్యాణ్ కొన్ని విషయాలపై చర్చలు జరిపామని విష్ణు వివరణ ఇచ్చారు. ఇది మన తల్లి జాగ్రత్తగా చూసుకో పవన్ కళ్యాణ్ గారు తనకు చెప్పినట్లు విష్ణు తెలియజేశాడు. అలాగే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సమక్షంలోనే మంచి కార్యక్రమం జరిగిందని ప్రోటో కాల్ కూడా పాటించినట్లు తెలియజేశాడు.

ప్రకాష్ రాజ్ మళ్ళీ పోటీ చేసుకోవచ్చు

ప్రకాష్ రాజ్ మళ్ళీ పోటీ చేసుకోవచ్చు

లోకల్ నాన్ లోకల్ అనే విషయం గురించి మాట్లాడిన మంచు విష్ణు వచ్చే ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ మళ్లీ పోటీ చేసుకోవచ్చని తెలుగు వాళ్ళు మాత్రమే మా ఎన్నికల్లో పోటీ చేయాలి అనే విషయం మేము ఎక్కడ ప్రస్తావించలేదని తెలియజేశాడు. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి మోహన్ బాబు గారు మంచి స్నేహితులుగా మళ్ళీ ఫోన్ లో మాట్లాడుకున్నారు అని వివరణ ఇస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా మళ్లీ మంచి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలియజేశాడు.

Recommended Video

Bigg Boss Telugu 5: Shanmukh @1 నామినేషన్స్‌లో టైటిల్ ఫేవరెట్లు Top 5 Contestants | Filmibeat Telugu
 అతని వల్లే గొడవలు

అతని వల్లే గొడవలు

అయితే ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో గొడవలు జరగడానికి ఒక ప్రధాన వ్యక్తి కారణం అని మంచు విష్ణు ఆరోపణలు చేశాడు. జర్నలిజాన్ని భ్రష్టు పట్టించే ఒక జర్నలిస్టు ద్వారానే ఈ గొడవ మొదలైంది అని అతను ఒక డబ్బింగ్ సినిమాల్లో నటించి ఆ తర్వాత మా సభ్యుడు అయినట్లు తెలిపారు. ఆ జర్నలిస్టు వల్ల గొడవలు మొదలైనట్లు విష్ణు వివరణ ఇచ్చాడు.

మంచు విష్ణు చేసిన ఈ ఆరోపణలతో మళ్లీ మా వివాదాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో అని అందరూ చర్చించుకుంటున్నారు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన ఆయన ప్యానెల్ సభ్యులు రాజీనామా ప్రకటించినప్పటికీ ఇంకా రాజీనామా లేఖలు మంచు విష్ణుకు చేరకపోవడంపై అనుమానాలు మొదలవుతున్నాయి. కావాలని సీన్ క్రియేట్ చేశారా అనే టాక్ కూడా వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X