కన్నప్ప సక్సెస్.. ప్లేట్ తిప్పేసిన మంచు విష్ణు.. ఆ స్టార్ గురించి ఇలా?
టాలీవుడ్ స్టార్ మంచు విష్ణు తాజాగా నటించిన చిత్రం కన్నప్ప. టాలీవుడ్ లో ఆధ్యాత్మిక చిత్రాల్లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఇది భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంది. ఈ చిత్రానికి మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. టాప్ టెక్నీషియన్లు, టాప్ స్టార్ హీరోలు ఈ చిత్రం కోసం పని చేశారు. మొత్తానికి కన్నప్ప చిత్రం గ్రాండ్ సక్సెస్ ను అందుకుంది. ఈ క్రమంలో సినిమాకు పాన్ ఇండియా స్టార్ పేరు వాడుకోని, ఇప్పుడేమో ఆయన వల్ల కాదని, మరో స్టార్ వల్ల సినిమాకు హై వచ్చిందని చెప్పడం హాట్ టాపిక్ గ్గా మారింది. ఇంతకీ మంచు మాట్లాడిందేంటీ అనే వివరాల్లోకి వెళితే..
కన్నప్ప చిత్రానికి మెయిన్ పిల్లర్స్..
తొలుత కన్నప్ప చిత్రానికి కథను సమకూర్చడానికి తనికెళ్ల భరణి, తదితరులు సహకరించారు. మరోవైపు మంచు విష్ణు కథను రీసెర్చ్ చేశానని చెప్పుకొచ్చారు. ఇక టాలీవుడ్ సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాకు ప్రొడ్యూస్ చేయడం విశేషం. హిందీ మహాభారతం సీరియల్ ను డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ సినిమాకు దర్శకత్వం వహించడం మరో విశేషం.

ఇదంతా ఒకెత్తైయితా.. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మలయాళం స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ లు కీలక పాత్రలు పోషించడం ఈ సినిమా మెయిన్ పిల్లర్ గా మారింది. అయితే వీరి క్రేజ్ వల్లనే కన్నప్ప చిత్రానికి భారీ హైప్ వచ్చిందని, ముఖ్యంగా ప్రభాస్ వల్ల సినిమా రేంజ్ పెరిగిందనే టాక్ వినిపించింది. భారీ తారాగణం, టాప్ టెక్నీషియన్లు ఈ సినిమా సక్సెస్ లో భారీ పాత్రను పోషించారు.
సినిమా రిలీజ్ కు ముందు..
కన్నప్ప సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో భారీ ఎత్తున జూన్ 27న రిలీజ్ చేశారు. అయితే సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ప్రభాస్ పేరును గట్టిగానే వాడేశారు. అటు అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ కూడా సినిమాకు పెద్ద ఎత్తున సహకరించారు. ఇక తెలుగు స్టేట్స్ లో మాత్రం ప్రభాస్ పేరును పదే పదే వాడుతూ వచ్చారు. మరోవైపు డార్లింగ్ అభిమానులు కూడా సినిమాను ఎకంరేజ్ చేశారు.
సినిమాకు హై ప్రభాస్ ఎంట్రీతో కాదు..
కన్నప్ప చిత్రం చూసిన ప్రేక్షకులు అందరూ ఫస్ట్ హాఫ్ లో కంటే సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ తర్వాత వేరే లెవల్ ఉంటుదని చెబుతున్నారు. కానీ తాజాగా కన్నప్ప సక్సెస్ మీట్ లో మంచు విష్ణు ఆసక్తికరంగా మాట్లాడారు. సినిమాలో ప్రభాస్ కంటే ముందే హై వస్తుందని చెప్పారు. సీనియర్ నటుడు శరత్ కుమార్ తో తనకు ఉన్న సీన్ వద్ద కథ మారి సినిమాకు హైనిస్తుందని చెప్పారు. ప్రభాస్ కంటే ముందే తన సీన్ తోనే హైప్ వస్తుందని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.


Click it and Unblock the Notifications











