శ్రీహరి అంకుల్ ఉంటే గుణపాఠం చెప్పేవారు.. అప్పుడు మా నాన్న కాళ్ళు తాకావు: ప్రకాష్ రాజ్ పై విష్ణు కామెంట్స్
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా మా ఎన్నికల వివాదం మరింత ఘాటుగా మారింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల బరిలో అభ్యర్థులుగా ఉన్నటువంటి వారు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉండడం మీడియాలో చర్చనీయాంశం గా మారింది. అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నటువంటి ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు ఇద్దరు కూడా ఏ మాత్రం తగ్గకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఆఖరికి గతంలో జరిగిన చేదు అనుభవాలను అలాగే పొరపాట్లను కూడా గుర్తు చేసుకుంటూ రాష్ట్రస్థాయి ఎన్నికల ప్రచారాలను తలపిస్తున్నారు. ఒక విధంగా పొలిటికల్ పార్టీ తరహాలోనే మా ఎన్నికలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఇక ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు మరోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోసం జరుగుతోంది..
ఇటీవల ప్రకాష్ రాజ్ పోస్టల్ బ్యాలెట్ విషయంలో అనేక రకాల లొసుగులు ఉన్నాయి అంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. చాలా పెద్ద మోసం జరుగుతోంది అని ఈ రకంగా రాజకీయాలు చేయడం ఏమాత్రం న్యాయం కాదని మంచు విష్ణు మోహన్ బాబు చాలా మందిని మోసం చేస్తున్నారని కూడా ప్రకాష్ రాజ్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ పై కూడా మంచు విష్ణు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు.

శ్రీహరి గుణపాఠం చెప్పేవారు
మంచు వారి కుటుంబ సభ్యుల పై కామెంట్ చేసినందుకు మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యలో మా ఫ్యామిలీ ఏమి చేసింది. కావాలంటే నన్ను మాత్రమే టార్గెట్ చేయండి. అసలు నిజాలు అన్నీ మర్చిపోయారా. 2004 - 2005 లో ఏం జరిగిందో గుర్తు లేదా? శ్రీ హరి అంకుల్ గాని బ్రతికి ఉంటే మీకు సరైన గుణపాఠం చెప్పే వారు. ఆయన ప్రస్తుతం స్వర్గంలో ఉన్నారు. ఆయనే మీకు తగ్గట్టుగా సరైన సమాధానం చెప్పేవారు.

పదిమందిలో బూతులు తిట్టారు
వస్తాడు నా రాజు సినిమాకు నేనే హీరో నేనే నిర్మాతను. ఆ సినిమా దర్శకుడిని మీరు పదిమందిలో బూతులు తిట్టారు. చాలా దుర్భాషతో మాట్లాడారు. ఆ విషయాన్ని ఎవరికైనా ఈ రోజు వరకు చెప్పానా? కానీ మీరు చెప్పిస్తున్నారు. ఈరోజు నా కుటుంబ సభ్యులను మీరు అనవసరంగా లాగుతున్నారు. సాఫీగా సాగే ఈ ఎలక్షన్స్ లో కూడా మీరు కాంట్రవర్సి చేస్తున్నారు. ఈవీఎం కావాలి బ్యాలెట్ పేపర్స్ వద్దు అంటున్నారు అయితే రేపు ఈవీఎంలో కూడా నేను గెలిస్తే మళ్లీ అక్కడ ఏదో మోసం జరిగింది అని కూడా అంటారు. అలాంటి ఆరోపణలు కూడా మీరు చేస్తారు.. అని విష్ణు మాట్లాడాడు

శ్రీకాంత్ గారు నేను ఏమిటో మీకు తెలుసు
శ్రీకాంత్ గారి గురించి కూడా మాట్లాడుతూ.. నేను మీ ముందు పుట్టి పెరిగిన వాన్ని. చిన్నప్పటి నుంచి మీకు నేను ఏమిటో తెలుసు. మా కుటుంబ సభ్యుల గురించి కూడా మీకు తెలుసు. మా నాన్న గారిని మీరు అన్నా అని పిలుస్తారు. నాలుగు రోజుల ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది నెగిటివ్ గా అవుతోందని చెప్పినప్పుడు మీరు ఏం కంగారుపడకండి మీరు ఎప్పుడైనా సరే నాకు కావాల్సిన వాళ్ళని కూడా నేను సమాధానం ఇచ్చాను. మనమే గంట సేపు మాట్లాడుకున్నాం.. అని విష్ణు తెలియజేశాడు
Recommended Video

ఇదే లాస్ట్.. మర్యాద ఇచ్చేది లేదు
ప్రకాష్ రాజ్ గారు మరోసారి మా ఫ్యామిలీ సభ్యులను ఈ కాంట్రవర్సీ లోకి లాగితే మాత్రం మర్యాద ఇచ్చేది మాత్రం లేదు ఇదే లాస్ట్ అంటూ మంచు విష్ణు తెలియజేశాడు. ఇక మరోవైపు ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ ప్రకాష్ రాజ్ ప్యానెజ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఈ విషయంలో ప్రకాష్ రాజ్ నుంచి ఇంకా ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











