ఆరని మంచు వారి మంటలు.. పంచదారతో చిచ్చు పెట్టిన మంచు విష్ణు

ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించి పలువురు సినీ ప్రముఖుల విషయంలో పరిస్థితులు రసవత్తరంగా మారుతున్నాయి అనేది అందరికీ తెలిసిందే. ఒక పక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సంబంధించిన గొడవలు.. ఇంకోపక్క మంచు వారి ఫ్యామిలీ గొడవలతో గత కొద్దిరోజులుగా ఓ రేంజ్‌లో నడిచిన రచ్చ అంతా ఇంతా కాదు అని చెప్పాలి. మొదటిగా మంచు వారి ఇంట రచ్చ తోనే టాలీవుడ్‌ షాకైంది.

కానీ మధ్యలో ఐకాన్ స్టార్ అరెస్ట్ అలాగే తన విడుదల వార్తలు మధ్యలో మంచు వారిని టేకోవర్ చేశాయి. కానీ తర్వాత బన్నీ రిలీజ్ అయ్యాక అంతా సెట్ అయ్యి అల్లు అర్జున్ కోసం సినీ ప్రముఖులు అంతా ఏకతాటిపైకి రావడంతో మొత్తం సర్దుమణిగిపోయింది. అల్లు అర్జున్ కాంట్రవర్సీ సెట్ అనుకునేలోపే ఇపుడు మళ్ళీ మంచు వారి కాంట్రవర్సీ ఊపందుకుంది.

manchu vishnu silly issues with manchu manoj released cctv footage

మొన్ననే మంచు మోహన్ బాబు ఓ న్యూస్ ఛానెల్ విలేఖరిని కొట్టడం షాకింగ్ గా మారింది. దీని తర్వాత మోహన్ బాబు పరారీలో ఉన్నారు అంటూ వచ్చినా వార్తలపై స్వయంగా కలెక్షన్ కింగ్ క్లారిటీ ఇచ్చారు. ఇక లేటెస్ట్‌గా ఆ విలేఖరిని మోహన్ బాబు కలిసి సారీ చెప్పడం కూడా జరిగింది. దీని తర్వాత నుంచి మంచు వారి ఇంట ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ ఓ షాకింగ్ సీసీ టీవీ ఫుటేజ్ ని రివీల్ చేసాడు.

ఇందులో మంచు విష్ణు తన ఇంటికి వచ్చి చేసిన పనిని తెలియజేసాడు. ఇంతకీ ఈ సీసీ టీవీ ఫుటేజ్ లో ఏముందంటే స్టైలిష్‌గా కొంతమందితో మంచు విష్ణు తమ్ముడు మనోజ్ ఇంటికి కార్ లో వెళ్ళాడు. అలా వెళ్ళాక వెనుక నుంచి ఎవరో ఓ బ్యాగ్ బయటకి తీసుకొచ్చారు. ఆ బ్యాగ్‌లో బోల్డంత పంచదార ఉండగా దీనిని మనోజ్ ఇంటి దగ్గర ఉన్న జెనరేటర్ క్యాప్ మూతలు తీసేసి వాటి నిండా ఆ పంచదారతో నింపేసాడు.

manchu vishnu silly issues with manchu manoj released cctv footage

దీనితో మనోజ్ ఇంట్లో కరెంటు పోయేలా విష్ణు చేసినట్టుగా మోహన్ బాబు చిన్న కుమారుడు తెలిపాడు. అంతేకాదు.. ఈ సీసీటీవీ ఫుటేజ్‌ని తీసుకెళ్లి తన అన్నయ్య తన ఇంటి దగ్గరకి వచ్చి జెనరేటర్ లలో పంచదార పోసి ఇంటికి కరెంట్ కట్ చేసాడు అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసాడట. దీంతో ఈ అంశం ఇపుడు షాకింగ్ గా మారి మళ్ళీ మంచు వారి ఇంట మంటలు రేపెలా చేసాయి.

మొన్ననే మంచు విష్ణు చేసిన కామెంట్స్ కూడా తన తమ్ముడు విషయంలో వైరల్ గా మారాయి. ఇప్పుడేమో ఈ ఘటన వెలుగులోకి రావడంతో మంచు బ్రదర్స్ నడుమ ఓ రేంజ్‌లో మంటలు ఉన్నాయి అని అర్ధం అయ్యిపోయింది. మరి చూడాలి వీరి నడుమ పంచాయితీ ఎక్కడ వరకు వెళుతుందో అని ఆసక్తి అందరిలో రేకెత్తింది.

More from Filmibeat

Read more about: manchu manoj manchu mohan babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X