Don't Miss!
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్న మంచు విష్ణు.. నెవర్ బిఫోర్ అనేలా..
సక్సెస్ కోసం కష్టపడుతున్న హీరోలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అయితే ఎవరికి కూడా అంత ఈజీగా సక్సెస్ రావడం లేదు. అందులో మంచు బ్రదర్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా మంచు విష్ణు ఈ సారి సక్సెస్ కోసం ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్స్ తో రంగంలోకి దిగాడు. ఇంగ్లీష్ తెలుగులో ఒకేసారి రూపొందిస్తున్న మోసగాళ్ళు సినిమా కోసం ఈ యువ హీరో చాలానే కష్టపడుతున్నాడు. అయితే కాన్సెప్ట్ మీద నమ్మకంతో ఈ హీరో బడ్జెట్ విషయంలో రిస్క్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది.
మంచు విష్ణుకి సక్సెస్ లేక చాలా కాలమవుతోంది. మంచి టైమింగ్ ఉన్న నటుడే అయినప్పటికీ సరైన కథలు దొరక్క ఇంకా కుదురుకోలేక పోతున్నాడు. ఇక జెఫ్రీ చిన్ అనే హాలీవుడ్ డైరెక్టర్ తో చేస్తున్న మోసగాళ్ళు సినిమాను విష్ణు సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా మీద నమ్మకంతో దాదాపు రూ.80కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాడట. ఇంతవరకు 25కోట్ల కంటే ఎక్కువగా ముందుకు వెళ్ళని మంచు విష్ణు ఒకేసారి ఆ స్థాయిలో ఖర్చు చేస్తుండడంతో ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే చాలా సినిమాలతో మంచు విష్ణు ఆర్థికంగా దెబ్బ తిన్నాడు. ఇక ఈ సారి అలా కముండా ప్లాన్ ప్రకారం సినిమా బిజినెస్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రమోషన్స్ తోనే సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. కాజల్ అగర్వాల్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక మంచు విష్ణు ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెట్టుకున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో సినిమా నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని ప్రచారాలు కూడా స్టార్ట్ చేశాడు. మరి ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.