కాల్ సెంటర్‌లో పెట్టుబడి పెడుతున్న హీరో భార్య.. కాజల్, భర్త సహకారంతో!
టాలీవుడ్ చిత్రసీమలో సరికొత్తగా ఆలోచిస్తున్నారు నేటితరం హీరోలు, వారి వారి భార్యలు. కేవలం సినిమాలే గాక ప్రొడక్షన్, బిజినెస్‌కి సంబంధించిన పనుల్లో భాగమవుతూ విలక్షణత చాటుకుంటున్నారు. ఇప్పటికే ఈ లిస్టులో మహేష్ బాబు సతీమణి నమ్రత చేరిపోగా, తాజాగా మంచు విష్ణు భార్య విరానిక కూడా అదే పని మొదలెట్టేసింది.
ఇన్ని రోజులు గృహిణిగా ఉన్న విరానిక నిర్మాతగా మారింది. 'కాల్ సెంటర్' అనే పేరుతో తెరకెక్కుతున్న సినిమాకు నిర్మాణ బాధ్యతలు చెప్పటింది విరానిక. వీఎంఆర్ ఎంటర్ టైన్ మెంట్- ఏవీఏ ఎంటర్ టైన్ మెంట్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

కాల్ సెంటర్ తెలుగు వెర్షన్ లో విరానిక భర్త మంచు విష్ణు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇకమంచు విష్ణుకి చెల్లెలిగా కాజల్ నటిస్తుండటం ఈ సినిమా మరో ప్రత్యేకత. కాజల్ నటిస్తున్న తొలి హాలీవుడ్ సినిమా కూడా ఇదే కావడం విశేషం. మంచు విష్ణు సరసన రుహానీ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే టైటిల్ ప్రకటించబడిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
టైటిల్‌కి తగ్గట్టే ఈ సినిమా కథాంశం ఓ కాల్ సెంటర్ చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఇందులో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటించనున్నారు. తెలుగులో ఇదే ఇతనికి తొలి సినిమా కానుంది. చూడాలి మరి మంచు విష్ణు భార్యకు ఈ సినిమా ఏ మేర లాభాలు తెచ్చిపెడుతుందో!.


Click it and Unblock the Notifications











