Manchu Vishnu : నాకు ఇలా ఉండటమే ఇష్టం.. ఫ్యామిలీ గొడవలపై తొలిసారి విష్ణు కామెంట్స్.!
మంచు ఫ్యామిలీలో గొడవలు.. ఇండస్ట్రీలో ఉన్న వారినే కాకుండా వారి అభిమానులు, సాధారణ జనాలను కూడా కాస్తా అప్సెట్ చేస్తున్నాయి. క్రమశిక్షణకు మారుపేరు అయిన మోహన్ బాబు ఇంట్లోనే తరుచుగా ఘర్షణలకు తావు దొరుకుతుండటం ఆయనను అభిమానించే వారికి కష్టంగా అనిపిస్తోంది. కొన్నాళ్లుగా మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ గా వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో వీరి మధ్య కోల్ల్ వార్ జరుగుతూనే ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు బహిరంగంగానే ఘర్షణలకు దిగుతుండటం బాధాకరం. ఇన్ని గొడవల మధ్య ఆ కుటుంబం కలిసిమెలిసి ఉంటే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక తాజాగా మంచు విష్ణు కూడా తన ఫ్యామిలీ గొడవలపై తొలిసారి వివరంగా మాట్లాడారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం ప్రమోషన్స్ పై దృష్టిపెట్టారు. కన్నప్ప.. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మొదటి ఇంటర్వ్యూ ఇచ్చారు మంచు విష్ణు. ఈ సందర్భంగా తన కుటుంబం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టమని, అందరూ కలిసి ఉంటే చూడాలని ఉందని చెప్పుకొచ్చారు. తన పిల్లలను ఉమ్మడి కుటుంబంలోనే పెంచాలని ఎంతగానో ఆశపడ్డట్టు తెలిపారు. కానీ అనుకొని గొడవలు వచ్చాయమన్నారు.

ఆ పరమశివుడికి కోరుకునేది ఒక్కటే.. ఎన్ని జన్మలెత్తినా నాకు తండ్రిగా మోహన్ బాబుగారే ఉండాలని కోరుకున్నారు. అలాగే ఇప్పటికిప్పుడు తన ఫ్యామిలీ గొడవలన్నీ ఆగిపోతే బాగుండూ అని ఆశించారు. అందరూ కలిసి ఉంటే బాగుంటుందని, తన పిల్లలు జాయింట్ ఫ్యామిలీలో పెరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు... అయితే ప్రత్యేకంగా మనోజ్ గొడవనుద్దేశించి ఎదురైన ప్రశ్నకు మాత్రం తనకు పట్టనట్టుగానే సమాధానం ఇచ్చినట్టు కనిపిస్తోంది. కుటుంబంతో కలిసి ఉండాలని మనం కోరుకున్నా.. అది జరగాలి కదా అంటూ సమాధానం ఇచ్చారు.
ఏదేమైనా తన కుటుంబం బాగుండాలని మంచు విష్ణు కోరుకుంటుండం మంచు అభిమానులను సంతోషపెడుతుంది. మంచు మనోజ్ కూడా ఈ ఫ్యామిలీతో కలిసి ఉండాలని.. అభిప్రాయపడుతున్నారు. ఇక రీసెంట్ గానే మనోజ్ ఎంబీయూలో జరుగుతున్న దారుణాలు అంటూ మీడియాతో వరుసగా మాట్లాడిన విషయం తెలిసిందే. అంతకు ముందే.. మంచు మోహన్ బాబు, మనోజ్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. మనోజ్ - అఖిల పెళ్లి తర్వాత గొడవలు ముదురుతూ వస్తున్నాయి. ఇంక వీటికి ఎప్పుడూ ఫుట్ స్టాప్ పడుతుందో చూడాలి.

ఇక మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' విషయానికొస్తే.. 2025 ఏప్రిల్ 25న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్ తో పాటు భారీ తారాగణంతో షూటింగ్ మొత్తం న్యూజిలాండ్ లోనే జరిపారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా.. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ కామియో అప్ఫీయరెన్స్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా శివుడిపై వచ్చిన 'శివా శివా శంకర' సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఈ హిస్టారికల్ డ్రామాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ... అలాగే ఇంగ్లీష్ లోనూ విడుదల చేస్తున్నారు. స్టీఫెన్ దేవాసీ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











