మంచు విష్ణుకి షాక్.. కన్నప్ప హార్డ్ డిస్క్‌ని ఎత్తుకెళ్లిన అగంతకులు

ఏళ్లుగా ఒక్క హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు మంచు విష్ణు. ఈసారి ఎలాగైనా సాలీడ్ హిట్ సాధించాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం కన్నప్ప. శ్రీకాళహస్తిశ్వరుడి పరమ భక్తుడు.. భక్త కన్నప్ప జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్ప వచ్చిన దశాబ్ధాల తర్వాత అదే ఇతివృత్తంతో వస్తున్న సినిమా కావడంతో కన్నప్పపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ప్రకటన నుంచే ఎన్నో సంచలనాలకు వేదికగా నిలిచింది. బడ్జెట్, క్యాస్టింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కన్నప్పను తెరకెక్కిస్తున్నారు మోహన్ బాబు. త్వరలో కన్నప్పను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా చిత్ర యూనిట్ ఊహించని సమస్యల్లో ఇరుక్కుంది.

భక్త కన్నప్ప కోసం కష్టపడుతున్న విష్ణు

తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో క్లాసిక్స్‌లో ఒకటైన భక్త కన్నప్పను రీమేక్ చేయాలని విష్ణు నిర్ణయించడమే ఓ సాహసం. ఇన్నేళ్లలో ఎవరూ కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదు. కానీ మంచు ఫ్యామిలీ విష్ణు కోసం డేర్ స్టెప్ తీసుకుంది. తన కెరీర్ తిరిగి గాడినపడాలంటే ఈ సినిమానే తన జీవితం అన్నంతగా కష్టపడుతున్నాడు మంచు విష్ణు. కుటుంబంలో సమస్యలున్నా ఈ సినిమాపై పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ప్రమోషన్, చిత్రీకరణ విషయంలో దూకుడుగా వెళ్తున్నాడు విష్ణు.

manchu Vishnu s kannappa movie hard drive missing

బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, శరత్ కుమార్, మధు, ముఖేష్ రిషితో పాటు మోహన్‌లాల్ , ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తుండటంతో భారతీయ చిత్ర పరిశ్రమ కళ్లన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటికీ నటీనటుల పాత్రల తాలుకూ పోస్టర్లు విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. దాదాపు రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌‌లపై కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టీఫెన్ దేవాస్సే స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి స్వయంగా మంచు విష్ణు కథ , స్క్రీన్ ప్లేను అందిస్తుండటం విశేషం.

జూన్ 27న కన్నప్ప విడుదల

తొలుత సమ్మర్ కానుకగా ఏప్రిల్ 25న కన్నప్పను పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఇంతలో కన్నప్ప సినిమా వాయిదా వేస్తున్నట్లు విష్ణు అధికారికంగా ప్రకటించారు. కీలకమైన సన్నివేశాల తాలుకూ వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాలేదని సినిమా ఆలస్యమైనందుకు క్షమించాలని మంచు విష్ణు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే జూన్ 27న కన్నప్ప సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సినిమా రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేశారు.

హార్డ్ డిస్క్ మిస్సింగ్

సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న దశలో కన్నప్ప యూనిట్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను ఇద్దరు వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారు. కన్నప్ప సినిమాకు కోకాపేటకు చెందిన విజయ్ కుమార్ 24 ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ కంటెంట్ తాలుకూ హార్డ్ డ్రైవ్‌ను ముంబైకి చెందిన హెచ్ఐవీఎస్ స్టూడియస్ వారు కొరియర్ ద్వారా హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని విజయ్ కుమార్ కార్యాలయానికి పంపారు. ఈ కొరియర్‌ను మే 25న రఘు అనే ఆఫీస్ బాయ్ రిసీవ్ చేసుకుని చరిత అనే మహిళకు అందజేశాడు.

Take a Poll

కన్నప్పపై కుట్ర చేస్తున్నారా?

నాటి నుంచి వారిద్దరూ కనిపించడం లేదని విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరో చెప్పిన విధంగా కన్నప్ప చిత్రానికి నష్టం కలిగించేలా వీరిద్దరూ వ్యవహరిస్తున్నారని విజయ్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కన్నప్ప తాలూకా హార్డ్ డ్రైవ్ కనిపించకుండా పోవడం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: manchu vishnu kannappa movie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X