ఆ పాట ‘ఊల్లాల ఊల్లాల’ చిత్రానికే హైలైట్.. ఆయన్ను చూస్తే భయమేసేది

Recommended Video

Ullala Ullala Movie Song Launch || Filmibeat Telugu

సీనియర్ నటుడు సత్యప్రకాష్ దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ పతాకంపై 'లవర్స్ డే' ఫేమ్ ఎ.గురురాజ్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ఊల్లాల ఊల్లాల. సత్యప్రకాష్ తనయుడు నటరాజ్ హీరోగా పరిచయమవుతున్నారు. నూరిన్‌, అంకిత‌ కథానాయికలుగా నటిస్తున్నారు.తెలుగు రాష్ట్రాలను తన గానంతో ఉర్రూతలూగించిన మంగ్లీ ఊల్లాల ఊల్లాల చిత్రంలో 'రాం రాం' పాట పాడుతూ నటించడమే కాక, హీరోయిన్ నూరిన్ కి డబ్బింగ్ చెప్పింది. 'రాం రాం' అనే ఈ పాటను ప్రముఖ కమెడియన్ రఘు బాబు , పాపులర్ ర్యాప్ సింగర్ రోల్ రైడా కూడా ఆలపించడం విశేషం . ఈ పాట పూర్తి వీడియోను ఆదిత్యా మ్యూజిక్ సంస్థ ద్వారా హైదరాబాద్ లో రిలీజ్ చేసారు.

మొదట్లో భయంగానే..

మొదట్లో భయంగానే..

ఈ సందర్భంగా సింగర్ మంగ్లి మాట్లాడుతూ.. ‘నిర్మాత గురురాజ్ అన్న తన రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఎన్ని కష్టాలు , నష్టాలు పడ్డా చిత్ర పరిశ్రమకి దూరమవ్వకుండా మంచి మంచి చిత్రాలని సుఖీభవ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని ఆయన చాలా ఇష్టంతో నిర్మించారు. ఇందులో నన్ను కూడా భాగం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్నపుడు సత్యప్రకాష్ గారిని విలన్ గా చూసి చూసి మొదట్లో సెట్లో భయంగా అనిపించినా ఆయన తెరవెనుక స్వభావం, తెలుగు భాషపై పట్టు చూసాక ఆశ్చర్యపోయాను. ఆయన దర్శకత్వం చాలా బాగా చేశారు.

డబ్బింగ్ కూడా చెప్పాను..

డబ్బింగ్ కూడా చెప్పాను..

ఈ చిత్రంలో ఒక పాట నేను పాడి, ఆ పాటలో నేను నటించాను. నాతో పాటు నటించిన రోల్ రైడా మరియు సంగీతం అందించిన జాయ్, డాన్స్ మాస్టర్ శేఖర్ గారు నాకు చాలా సహకరించారు. రచయిత కాసర్ల శ్యామ్ గారు రాయగా నేను పాడిన పాటలన్ని ఇప్పటివరకు హిట్ అవుతూనే ఉన్నాయి. ఈ పాటతో చిత్రం కూడా అంతే పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం. ఇందులో హీరోయిన్ నూరిన్ కి నేను డబ్బింగ్ చెప్పాను. ఆ అమ్మాయి చాలా అద్భుతంగా నటించింది. అలాగే హీరో నటరాజ్ఈ చిత్రంలో చాలా ఉత్సాహంగా ఉంటాడు. మొత్తంగా ఈ చిత్రం నాకు చాలా బాగా నచ్చింది... మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాన'ని తెలిపింది.

 అన్ని హిట్టే..

అన్ని హిట్టే..

నిర్మాత ఏ . గురురాజ్ మాట్లాడుతూ.. ‘మా చిత్రం జనవరి 1న విడుదల అవుతుంది. కాసర్ల శ్యామ్ మా ప్రతి చిత్రంలో ఒక్క పాట అయినా కచ్చితంగా రాసి తీరుతారు. గమ్మత్తుగా అయన పాడిన పాటే చిత్రానికి హైలైట్ గా మారుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన రాసిన ఇస్మార్ట్ శంకర్ , అలవైకుంఠపురంలో పాటలు ఎలా హిట్ అయ్యాయో, మా 'రామ్ రామ్' పాట కూడా అలానే మంచి విజయం సాధిస్తుంది అని అనుకుంటున్నాను. అలాగే సింగర్ మంగ్లి ఈ ప్రత్యేక గీతం పాడి, నటించింది . అదే విధంగా హీరోయిన్ నూరిన్ కి డబ్బింగ్ కూడా చెప్పింది. మా సంగీత దర్శకుడు జాయ్ మంచి బాణీలు సమకూర్చారు. ఈ సినిమాని మా డైరెక్టర్ సత్య ప్రకాష్ చాల మంచిగా తీర్చిదిద్దారు . అలాగే డాన్స్ మాస్టర్ శేఖర్, ఫైట్స్ డ్రాగన్ ప్రకాష్ మరియు ఇతర ఆర్టిస్టులు అందరు చాలా బాగా పని చేశార'ని అన్నారు.

 నాలా ఎందరో ఉన్నారు..

నాలా ఎందరో ఉన్నారు..

దర్శకుడు సత్యప్రకాష్ మాట్లాడుతూ.. ‘నాలా అవకాశం కోసం ఎదురుచూసే వాళ్ళు ఎందరో ఉన్నా, నాకు మాత్రం గురురాజ్ అనే వ్యక్తి ''సత్య ప్రకాష్ నువ్వు డైరెక్షన్ చెయ్యి'' అని అంటూ, నాకేం తెలుసో తెలియదో కూడా అడక్కుండా నన్ను నమ్మి ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు నాకప్పగించారు. మా నిర్మాత గురురాజ్ గారే ఈ చిత్రం అవ్వడానికి కర్త కర్మ క్రియ. ఆయనతో పాటు రామకృష్ణ గౌడ్ గారు కూడా అండగా నిలబడ్డారు. వీరిద్దరి సహకారంతోనే అనుకున్నది సాధ్యమైంది. డిసెంబరు 1 న చిత్రం విడుదలవుతుంది. మంచి చిత్రం తీశామని నమ్మకం మాలో ఉంద'ని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X