మరో సూపర్ హిట్ పాటతో రచ్చ మొదలెట్టిన సింగర్ మంగ్లీ
యాంకర్ గానే కాకుండా సింగర్ గా నటిగా కూడా ఎంతగానో క్రేజ్ అందుకున్న మంగ్లీ మరో మంచి పాటతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. తీన్మార్ వార్తలతో మొదట మంచి క్రేజ్ అందుకున్న మంగ్లీ ఆ తరువాత సింగర్ గా యూ టర్న్ తీసుకొని అతి తక్కువ కాలంలోనే తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులను గెలుచుకుంది.
ఇక ఆమె పాడిన పాటలు యూ ట్యూబ్ లో ఏ స్థాయిలో వైరల్ అవుతున్నాయో స్పెషల్ చెప్పనవసరం లేదు. రేలారే అంటూ తెలంగాణకు సంబంధించిన సాంగ్స్ తో క్రేజ్ అందుకొని అనంతరం సినిమాల్లో కూడా పాడే స్థాయికి ఎదిగింది. అల వైకుంఠపురములో.. రాములో రాములో ఫీమేల్ సింగర్ గా క్లిక్కయిన విషయం తెలిసిందే.

ఇక ఈ సారి ఒక స్టైలిష్ సాంగ్ తో మరోసారి ఆడియెన్స్ ని ఆకర్షించేందుకు వచ్చింది. 'రబ రబ' అనే సరికొత్త సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లిస్ట్ లోకి చేరుతోంది. మంగ్లీ డ్యాన్స్ తో పాటు న్యూ గ్లామర్ పాటలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. గతంలో ఇదే మాదిరిగా మంచి పాటలతో మిలియన్ల వ్యూవ్స్ అందుకున్న మంగ్లీ ఈ సారి కూడా రబ 'రబ సాంగ్' తో ట్రెండ్ సెట్ చేసేలా ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











