మణిరత్నం ‘నవాబ్’ ఫస్ట్ లుక్: అరవింద్ స్వామి లుక్ కేక
ఇండియాలోని గొప్ప దర్శకుల లిస్టు తీస్తే అందులో తప్పకుండా ఉండే పేరు మణిరత్నం. తన ఫిల్మ్ మేకింగ్ స్టైల్‌తో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ స్టార్ డైరెక్టర్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే సినీ ప్రియులు ఎందరో. తాజాగా ఈ దర్శకుడి నుండి వస్తున్న మరో చిత్రం 'నవాబ్'. అరవింద్ స్వామి ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ సోమవారం విడుదల చేశారు.
మణిరత్నం సొంత బేనర్ మద్రాస్ టాకీస్ నిర్మిస్తున్న 'చెక్క చివంత వానమ్' చిత్రాన్ని తెలుగులో 'నవాబ్' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో అరవింద స్వామి వరద అనే పాత్రలో కనిపించబోతున్నారు. అరవింద స్వామితో పాటు జ్యోతిక, శింబు, విజయ్ సేతుపతి, అదితి రావు హైదరి, ప్రకాష్ రాజ్, అరుణ్ విజయ్, ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.
ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ లాంటి వారు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగం అయ్యారు. సెప్టెంబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళం, తెలుగుతో పాటు హిందీలోనూ ఈ మూవీ విడుదల కానుంది. భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగం కావడం విశేషం.

గతంలో అరవింద్ స్వామి హీరోగా మణిరత్నం తెరకెక్కించిన బొంబాయి, రోజా లాంటి చిత్రాలు నేషనల్‌వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. చాలా కాలం తర్వాత అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో మణిరత్నం నుండి సినిమా వస్తుండటంతో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.


Click it and Unblock the Notifications











